Begin typing your search above and press return to search.

దేవరకొండ.. చాలా తేడా అండీ బాబూ

By:  Tupaki Desk   |   22 Sep 2017 5:30 PM GMT
దేవరకొండ.. చాలా తేడా అండీ బాబూ
X
‘అర్జున్ రెడ్డి’తో రాత్రికి రాత్రే రాక్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో అతడికి యూత్ లో అదిరిపోయే ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఫాలోయింగ్ ను బాగానే వాడేసుకుంటున్నాడు విజయ్. బయట కూడా ‘అర్జున్ రెడ్డి’ యాటిట్యూడ్ చూపిస్తూ.. ఈ తరం కుర్రకారుకు మరింత చేరువైపోతున్నాడు. యూత్ కొంచెం తేడాగా కనిపించే.. తేడాగా మాట్లాడే.. తేడాగా డ్రెస్ చేసుకునే వాళ్లనే అమితంగా ఇష్టపడతారు. ‘అర్జున్ రెడ్డి’ యువతకు అంతగా నచ్చేయడానికి ఇది కూడా ఒక రీజన్. అందుకే విజయ్ తాను డిఫరెంట్ అని బయట కూడా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి మాటల.. డ్రెస్సింగ్.. ప్రవర్తన అన్నీ కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి.

‘అర్జున్ రెడ్డి’ రిలీజయ్యాక రెండు మూడు వారాల్లోనే విజయ్ వరుస బెట్టి ఫొటో షూట్లతో పలకరిస్తున్నాడు. ఇంతకుముందు ఒక వెరైటీ సూటుతో అతను చేసిన ఫొటో షూట్ చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో కొత్త షూట్ తో వచ్చాడు విజయ్. లుంగీ కట్టుకుని ఒక పోష్ కారు ముందు ఫొటోలకు పోజులిచ్చాడు. అందులో అతడి అవతారం చాలా వైవిధ్యంగా ఉండి.. యువతను భలేగా ఆకర్షిస్తోంది. ఈ ఫొటో షూట్లో కూడా విజయ్ యాటిట్యూడ్ స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలే విజయ్.. కళామందిర్ వాళ్ల కొత్త బ్రాండుకు అంబాసిడర్ గా కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. అతనిలాంటి ఫొటో షూట్లు చేస్తుంటే మున్ముందు మరిన్ని బ్రాండ్లు అతడి తలుపు తట్టడం ఖాయం.