Begin typing your search above and press return to search.

మ‌న ఓటు ఎవ‌రో వేయ‌డ‌మేంటి?

By:  Tupaki Desk   |   15 Nov 2018 10:03 AM GMT
మ‌న ఓటు ఎవ‌రో వేయ‌డ‌మేంటి?
X
తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కు రాజుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అధికార‌ప్ర‌తిప‌క్షాలు గెలుపే ధ్యేయంగా ఉర‌క‌లెత్తుతున్నాయి. కూట‌ములు పొత్తులు అంటూ చాలానే హ‌డావుడి సాగుతోంది. ఇలాంటి వేళ ఓటు విలువ‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్ప‌డం ఎంతైనా అవ‌స‌రం. అస‌లు ఓటు విలువ గురించి ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఎంత చెప్పినా ప‌ట్టించుకోని జ‌నాల‌కు సెల‌బ్రిటీలు చెబితే క‌నీసం విన‌బ‌డుతుందేమో! ఓటు ఎందుకు వేయాలి? వేయాల‌నుకోక‌పోతే ఏం చేయాలి? అనే దానిపై `ట్యాక్సీవాలా` విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌దైన స్టైల్లో చెప్పుకొచ్చారు.

ఓటు ఎంతో ఇంపార్టెంట్. మ‌న ఓటు మ‌నం వేయాలి. వేయ‌క‌పోతే అది ఎవ‌రో వేస్తారు. అయినా మ‌న ఓటు ఇంకెవ‌రో వేయ‌డ‌మేంటి? అందుకే జ‌నం - యువ‌త‌రం దీనిని గుర్తెర‌గాలి.. అని అన్నారు. ఓటు దుర్వినియోగం ఈ ఎన్నిక‌ల్లో ఆపాలి అని త‌న అభిమానుల‌కు పిలుపునిచ్చారు. యువ‌త‌రం దీనిపై జ్ఞానంతో వ్య‌వ‌హ‌రించాల‌ని త‌న అభిప్రాయాన్ని దేవ‌ర‌కొండ కుండ బ‌ద్ధ‌లు కొట్టాడు.

అస‌లు మీరు మొద‌టి ఓటు ఎక్క‌డ వేశారు? అంటే .. నా మొట్ట‌మొద‌టి ఓటు స‌రూర్ న‌గ‌ర్‌ లో వేశాను. నాకు అక్క‌డే ఓటు ఉంది. ఫ్యామిలీతో నారాయ‌ణ కాలేజ్ క్యూలో నిల‌బ‌డి మ‌రీ వేశానని గుర్తు చేసుకున్నారు. ఓటు హ‌క్కు వినియోగించుకోలేక‌పోతే ఏం చేయాలో కూడా దేవ‌ర‌కొండ చెప్పారు. ఓటు వేయాల‌ని అనిపించ‌పోతే క‌నీసం నోటాపై అయినా నొక్కండి. లేదంటే దొంగ ఓట్లు ప‌డి అడ్మినిస్ట్రేష‌న్ దొంగ‌ల పాలైపోతుంది. సిస్ట‌మ్ నాశ‌న‌మ‌వుతుంది అని అంతో ఇంతో త‌న‌కు ఉన్న నాలెజ్డ్ తో అర్థ‌మ‌య్యేలా చెప్పాడు. ఈ ఎన్నిక‌ల్లో యువ‌త‌రం దేవ‌రకొండ ఇచ్చిన సందేశాన్ని ఎంత‌వ‌ర‌కూ గుర్తుంచుకుంటారో చూడాలి. మునుప‌టితో పోలిస్తే సిస్ట‌మ్‌ పైనా - ఓటు హ‌క్కు వినియోగంపైనా ప్ర‌జ‌ల్లో అవేర్ నెస్ పెరిగింది. అయినా ఇంకా దొంగ వోట్ల స‌మ‌స్య అయితే త‌గ్గ‌లేదు. ఎక్క‌డో ఉన్న వారు వ‌చ్చి ఓటు వేయ‌నప్పుడు ఎవ‌రో ఒక‌రు ఆ ఓటును దుర్వినియోగం చేసేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ల ఓట్ల‌ను ఎవ‌రో ఒక‌రు వేసేస్తున్నారు. దీనిని నివారించేందుకు .. కోర్టుల్లో పోరాడేందుకు ఓ సెక్ష‌న్ ఉంద‌న్న సంగ‌తి ఎవ‌రికీ తెలీదు. ఎవ‌రైనా ఇంకో సినిమా వోడు చెబితే త‌ప్ప‌!! ఇక దేవ‌ర‌కొండ త‌న ఫేవ‌రెట్ పార్టీ టీఆర్ ఎస్‌ కి ఓటేస్తాన‌ని నోటా రిలీజ్ టైమ్‌ లో వేదిక‌ల‌పైనే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్‌ - కేటీఆర్‌ తో త‌న‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి త‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు.