Begin typing your search above and press return to search.

బీహార్‌ రియల్‌ రాజకీయాలతో 'నోటా'??

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:57 AM GMT
బీహార్‌ రియల్‌ రాజకీయాలతో నోటా??
X
విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత ‘నోటా’ చిత్రంతో వచ్చేందుకు సిద్దం అయ్యాడు. గీత గోవిందం సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ‘నోటా’పై అంచనాలు పీక్స్‌ లో ఉండటం చాలా కామన్‌. తమిళం మరియు తెలుగులో ఏకకాంలో రూపొందిన ఈ చిత్రంకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం టీజర్‌ వచ్చినప్పటి నుండి కూడా అంచనాలు - ఊహాగాణాలు భారీగా పెరిగి పోతూనే ఉన్నాయి.

ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన కారణంగా పలువురు పలురకాలుగా ఊహించేసుకుంటున్నారు. సీఎంగా విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ పరిస్థితులను అద్దం పట్టే విధంగా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. ఇక తమిళ సినీ జనాలు ఈ చిత్రం కథ బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు కాస్త దగ్గరగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన భార్య రబ్రీదేవిని రంగంలోకి దించాడు. ఇప్పుడు అలాగే ఈ చిత్రంలో కూడా చూపించబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

హీరో తండ్రి అవినీతి కేసులో అరెస్ట్‌ అవ్వడంతో, జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ హాయిగా విదేశాల్లో ఉండే వాడిని తీసుకు వచ్చి సీఎం చేస్తారట. సీఎం అయిన హీరో ఏం చేస్తాడు - ఎలా కథ నడుస్తుంది అనేది దర్శకుడు ఆసక్తికరంగా చిత్రీకరించినట్లుగా సమాచారం అందుతుంది. తమిళంలో విజయ్‌ దేవరకొండకు పెద్దగా గుర్తింపు లేదు. అయినా కూడా జ్ఞానవేల్‌ రాజా మరియు ఆనంద్‌ శంకర్‌ లు తమ పలుకుబడిని ఉపయోగించి భారీగా విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రం సక్సెస్‌ అయితే తమిళంలో మంచి స్థానం దక్కించుకున్న మొదటి తెలుగు హీరోగా విజయ్‌ దేవరకొండ నిలిచి పోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.