Begin typing your search above and press return to search.

నాకు కాలుద్ది.. నువ్వెవరు చెప్పడానికి..

By:  Tupaki Desk   |   15 Aug 2018 6:55 AM GMT
నాకు కాలుద్ది.. నువ్వెవరు చెప్పడానికి..
X
మెగా స్టార్ చిరంజీవిది ఓ స్టైల్.. యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ది మరో స్టైల్.. ఒక్కో హీరోకు ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు మార్చుకుంటారు.. మరికొందరు మార్చుకోరు.. జనాలను ఆకట్టుకునేందుకు కాంప్రమైజ్ అవుతారు. కానీ మన అర్జున్ రెడ్డి మాత్రం సర్దుకుపోయే సమస్యే లేదని తేల్చిచెబుతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో యాంగర్ మేనేజ్ మెంట్ కలిగిన యువకుడి పాత్రలో జీవించేసి ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ.. అదే అటిట్యూడ్ ను బయటకూడా కనబరుస్తున్నాడు. అద్భుతమైన నటనతోపాటు కాస్తా ఆవేశం కూడా ఈ హీరో సొంతం.. అందుకే ఇక తాను తనలాగే ఉంటానని.. ఎవ్వరూ తనకు సలహాలు ఇవ్వవద్దని గట్టి వార్నింగే ఇచ్చాడు..

తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’మూవీ ఈరోజు విడుదలైంది. సినిమాపై బోలెడు అంచనాలున్నాయి. సినిమాకు ప్రమోషన్ కల్పించేందుకు చిత్రం యూనిట్ విజయ్ దేవరకొండతో సినిమాలోని ఓ పాట పాడించింది. అసలే హస్కీ గొంతుతో ఉండే విజయ్ ఈ పాట పాడడంతో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. చెత్తగా పాడావంటూ వేలాది స్ఫూఫ్ లు రెడీ చేశారు. ప్రీ రిలీజ్ వేడకలో ఈ స్ఫూఫ్ లను స్వయంగా విజయ్ చూపించాడు కూడా.. అయితే తాజాగా నువ్వు మళ్లీ పాడొద్దని ట్రోల్ చేస్తుండడంతో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

విజయ్ మాట్లాడుతూ ‘కామెంట్లు పెట్టండి.. అభిప్రాయాలు చెప్పండి.. నేను వింటా.. కానీ సలహాలు ఇవ్వొద్దు నాకు నచ్చదు.. మా అమ్మానాన్న చెబితేనే నేను వినను.. నువ్వెవరు నాకు చెప్పడానికి . నేను దరిద్రంగా పాడానని చెప్పు. కానీ నువ్వు మళ్లీ పాడొద్దని చెప్పే రైట్ ఎవ్వరికీ లేదు. భవిష్యత్తులో కూడా పాడొద్దంటూ ఒప్పుకోను.. అది నా ఇష్టం’ అంటూ సీరియస్ అయ్యాడు. చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు తన ఆటిట్యూడ్ మార్చుకోవాలని సలహా ఇచ్చారని.. తన క్యారెక్టరే తన బలమని.. అది మారిస్తే విజయ్ ను ఎవ్వరూ చూడరని స్పష్టం చేశాడు. నేను నాకు లాగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తారని.. అలానే ఉంటానని విజయ్ స్పష్టం చేశాడు.