Begin typing your search above and press return to search.

'నోటా' వివాదం.. సెటిల్‌ అయితేనే విడుదల!

By:  Tupaki Desk   |   20 Sep 2018 7:08 AM GMT
నోటా వివాదం.. సెటిల్‌ అయితేనే విడుదల!
X
విజయ్‌ దేవరకొండ వరుసగా రెండు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లతో స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఈయన తాజాగా నటించిన ద్వి భాష చిత్రం ‘నోటా’. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. విజయ్‌ గత చిత్రాలు ‘అర్జున్‌ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ చిత్రాలు విడుదలకు ముందు వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. అర్జున్‌ రెడ్డి ముద్దు పోస్టర్‌ విషయంలో, గీత గోవిందం పైరసీ విషయంలో మీడియాలో విడుదలకు ముందు హల్‌ చల్‌ చేశాయి. ఇప్పుడు ‘నోటా’ చిత్రం కూడా విడుదలకు ముందు మీడియాలో ఒక వివాదంతో హడావుడి చేస్తోంది.

‘నోటా’ చిత్రంకు తెలుగులో తాను డైలాగ్స్‌ రాశానని, కాని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ తనకు పారితోషికం, టైటిల్‌ క్రెడిట్‌ ఇవ్వకుండా తన పేరు వేసుకున్నాడు అంటూ రచయిత శశాంక్‌ వెన్నెలకంటి మీడియా ముందుకు వచ్చి ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై చెన్నై పోలీసులకు కూడా ఈయన ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ‘నోటా’ ట్రైలర్‌ లో వచ్చిన డైలాగ్స్‌ తాను రాసినవే అని, కాని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ డైలాగ్స్‌ తనవి అంటూ టైటిల్‌ కార్డ్‌ వేసుకున్నాడు అంటూ శశాంక్‌ ఆగ్రహంతో ఉన్నాడు. తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వడంతో పాటు, టైటిల్స్‌లో తన పేరును చేర్చితేనే సినిమా విడుదల కానివ్వాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

ఈ విషయమై తమిళ మరియు తెలుగు సినీ పెద్దలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. తమిళంలో తాను రాసిన డైలాగ్స్‌ను తెలుగులో శశాంక్‌ అనువదించాడు తప్ప కొత్తగా అతడు ఏమీ డైలాగ్స్‌ రాయలేదు అంటూ ఆనంద్‌ శంకర్‌ తన వర్షన్‌ను తమిళ మీడియా ముందు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాదం ఒక కొలిక్కి వస్తే తప్ప సినిమా విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం లేదు. ఈ చిత్రం విడుదల విషయంలో అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తెలుగులో స్టార్‌ హీరో గుర్తింపు దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో మొదటి సారి తమిళనాట ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను అక్కడ, ఇక్కడ భారీ ఎత్తున విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ టైం నడుస్తున్న కారణంగా ఖచ్చితంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టనుందని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.