Begin typing your search above and press return to search.

నైజాం మెగాస్టార్ `హీరో`గా?!

By:  Tupaki Desk   |   12 Dec 2018 9:21 AM GMT
నైజాం మెగాస్టార్ `హీరో`గా?!
X
న‌టించిన నాలుగైదు సినిమాల‌తోనే నైజాం మెగాస్టార్ అంత ఎదిగాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్రస్తుతం బాక్సాఫీస్ పాలిట బంగారు కొండ‌గా వెలిగిపోతున్నాడు. `నోటా`తో పోగొట్టుకున్న పేరును `టాక్సీవాలా`గా రాబ‌ట్టుకున్నాడు. ఇంత‌లోనే అత‌డి ప్రాజెక్టుల లైనప్ చూస్తుంటే మ‌రో ప‌దేళ్ల పాటు అత‌డు ఎవ‌రికీ చిక్క‌డు, దొర‌క‌డు అన్న చందంగానే ఉంది స‌న్నివేశం.

ప్ర‌స్తుతం అతడు మైత్రి మూవీమేక‌ర్స్ ప‌తాకంపై `డియ‌ర్ కామ్రేడ్` అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఓ తెలుగు- త‌మిళ్ ద్విభాషా చిత్రంలోనూ న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అలాగే ఈ రెండు సినిమాల‌తో పాటు ఇప్ప‌టికే గీతా ఆర్ట్స్‌- స్టూడియోగ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్- యువి క్రియేష‌న్స్ లోనూ మ‌ళ్లీ సినిమాలు చేయ‌నున్నాడ‌న్న ప్ర‌చారం సాగుతోంది.

ఇంత‌లోనే మ‌రో ప్రాజెక్టు గురించిన స‌మాచారం అందింది. దేవ‌ర‌కొండ న‌టించే త‌దుప‌రి సినిమా టైటిల్ `హీరో`. దీనిని కూడా మైత్రి మూవీ మేక‌ర్స్ తెర‌కెక్కించ‌నుంది. ఇక ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడెవ‌రు? ఇత‌ర‌త్రా వివ‌రాలేంటో తెలియాల్సి ఉందింకా. హీరో అన్న టైటిల్ మెగాస్టార్ కి మాత్ర‌మే యాప్ట్‌. మేటి క్లాసిక్ ద‌ర్శ‌కుడు విజ‌య్ బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ న‌టించి, నిర్మించిన `హీరో`లో చిరు హీరోయిక్‌ వేషాలు ఓ రేంజులో ఉంటాయి. చిరంజీవి స‌ర‌స‌న రాధిక క‌థానాయిక‌గా న‌టిస్తే చ‌క్ర‌వ‌ర్తి సంగీతం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.

1984లో రిలీజైన ఈ చిత్రం ప‌క్కా ఫ్యామిలీ కంటెంట్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఇన్నాళ్టికి మ‌ళ్లీ ఆ టైటిల్‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ట‌చ్ చేయ‌డంతో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అరే అప్పుడే దేవ‌ర‌కొండ సుప్రీం`హీరో` అంత‌టోయ్యాడే! అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. ఇప్ప‌టికే నైజాం మెగాస్టార్ అని పిలుపించుకున్నాడు అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. దేవ‌ర‌కొండ న‌టిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్` ప్ర‌స్తుతం కాకినాడ ప‌రిస‌రాల్లో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక ప్రాజెక్టు చేస్తుండ‌గానే మ‌రో మూడు నాలుగు ప్రాజెక్టులు వెంట‌ప‌డుతున్నాయ‌ని దేవ‌ర‌కొండ ఇదివ‌ర‌కూ చెప్పాడు. `హీరో`గారి స‌న్నివేశం టూమ‌చ్ మ‌చ్చా!!