విజయ్ దేవరకొండకు భలే మంచి బేరము

Tue Apr 23 2019 11:53:02 GMT+0530 (IST)

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఎవరైతే మొదలుపెడతారో వాళ్ళే చివరిదాకా నిర్మాతలుగా ఉంటారన్న గ్యారెంటీ లేదు. అనుకోకుండానో లేదా ప్లానింగ్ తోనో ప్రాజెక్టులు చేతులు మారడం సర్వసాధారణం. విజయ్ దేవరకొండ ఎంతో ముచ్చటపడి తీయించుకున్న సినిమా ఇప్పుడు ఇదే తరహలో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. తనకు లైఫ్ ఇచ్చిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నాన్న వర్ధన్ దేవరకొండ నిర్మాతగా ఆ మధ్య ఓ సినిమా మొదలుపెట్టాడు. షూటింగ్ కూడా పూర్తయ్యే దశలో ఉంది.కథ బాగా నచ్చి ఒకదశలో ఇది విజయ్ దేవరకొండనే చేద్దాం అనుకున్నాడు. కాని ఆ సమయానికే విపరీతంగా పెరిగిపోయిన కమిట్ మెంట్స్ తో పాటు మార్కెట్ లో తన ఇమేజ్ కు వచ్చిన మార్పుల దృష్ట్యా ఇష్టం లేకపోయినా వదులుకున్నాడు. అయితే సబ్జెక్టు మీద నమ్మకంతో పెట్టుబడి మాత్రం పెట్టాడు. ఇప్పుడు ఇది ఏషియన్ సునీల్ హ్యాండ్స్ లోకి వెళ్లిపోయింది. చాలా రీజనబుల్ డీల్ కి సునీల్ నారంగ్ ఇది కొన్నారట. ఈ మేరకు విజయ్ నాన్న వర్ధన్ తాజాగా సునీల్ ను కలిసి ఈ సినిమా తాలుకు హక్కులు ఇచ్చి చెక్ పొందినట్టుగా చెప్పబడుతున్న ఫోటో ఆన్ లైన్ లోకి వచ్చేసింది.

ఇలా చేయడం వల్ల స్వంతంగా విడుదల చేసుకునే ప్రయాసతో పాటు మంచి ధియేటర్లు దొరుకుతాయా లేదా అన్న టెన్షన్ ఉండదు. ఏషియన్ సంస్థ కాబట్టి డిస్ట్రిబ్యూషన్ మొదలుకుని రిలీజ్ దాకా అంతా పక్కాగా జరుగుతుంది. ఎక్కువ శాతం పబ్లిక్ కు సినిమా రీచ్ అవుతుంది. అందుకే విజయ్ దేవరకొండ ఈ డీల్ కు ఒప్పుకుని నాన్న ద్వారా సెటిల్ చేయించాడట. ఎంతైనా రౌడీ హీరో తెలివితేటలే వేరు