అర్జున్ రెడ్డి హగ్ ఇచ్చాడు చూసితిరా

Sat Sep 23 2017 22:32:05 GMT+0530 (IST)

సినీ తారలు కలిసి నటించకున్నా ఎక్కడో ఒక చోట ఎదురుపడినప్పుడు చక్కగా మాట్లాడుకుంటారు. ఇక వారు ఈజీగా కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటె..చాలా క్లోజ్ అయిపోతారు. ఇదే తరహాలో ఒక హీరో మరియు హీరోయిన్ చాలా రోజులుగా పరిచయం ఉన్నట్లు కలుసుకున్నారు. వారు ఎవరో కాదు అర్జున్ రెడ్డి హీరో మరియు సెక్సీ హీరోయిన్ క్యాథరిన్.ఓ ప్రముఖ కంపెనీకి వీరిద్దరూ ప్రచారాలని నిర్వహించడానికి రెడీ అయ్యారు. అయితే ప్రచారంలో భాగంగా ఒక చోట ఎదురు పడే సరికి ఇద్దరు గట్టిగా హాగ్ చేసుకున్నారు. దీంతో ఎప్పుడు లైవ్ లో అలాంటి సీన్స్  చూడని కొంతమంది హవ్వా అని అనుకున్నారు. కలిసి నటించలేదు గాని ఎదురుపడగానే గట్టి హగ్ తో వెల్కమ్ చెప్పుకున్నారు. క్యాథరిన్ పట్టు చీరలో బలే అందంగా. ఇక విజయ్ దేవరకొందా నార్మల్ డ్రెస్ లో బావున్నాడు. దీరిద్దరు కలిసి ప్రచారం చేయడంతో జోడి అదిరింది అనే కామెంట్స్ వినబడుతున్నాయి.

అంతే కాకుండా వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి హాగ్ ఇచ్చేశాడుగా అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ ప్రస్తుతం సినిమాల్లో బాగేనా రాణిస్తున్నారు. సినిమాలతోనే కాకుండా ఇలా ప్రచారంలోనూ రెమ్యునరేషన్ అందుకుంటూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు.