Begin typing your search above and press return to search.

ఇందుకే దేవరకొండ అంటే యూత్‌ కు క్రేజ్‌

By:  Tupaki Desk   |   20 Nov 2018 2:30 PM GMT
ఇందుకే దేవరకొండ అంటే యూత్‌ కు క్రేజ్‌
X
టాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తాజాగా ట్యాక్సీవాలా చిత్రంతో మరోసారి గట్టిగా కొట్టాడు. గీత గోవిందం చిత్రం తర్వాత ‘నోటా’తో కాస్త నిరాశ పర్చినా కూడా ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో మెరుపులు మెరిపించాడు. కేవలం ఒక్కరోజులోనే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకున్న ట్యాక్సీవాలా ప్రమోషన్‌ లో భాగంగా ఆసక్తికర కార్యక్రమాలను దేవరకొండ చేస్తున్నాడు. ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలైన రోజు నిజంగానే విజయ్‌ దేవరకొండ ట్యాక్సీవాలా అవతారం ఎత్తాడు. ఒక కాంటెస్ట్‌ పెట్టి అందులో గెలిచిన వారికి ట్యాక్సీవాలా అయ్యాడు. అయితే కొందరిని మిస్‌ చేసిన దేవరకొండ వారికి కాల్‌ చేసి మరీ సారీ చెప్పాడు.

ఉప్పల్‌ కు చెందిన అభిమాని సాయిని తన కారులో ఎక్కించుకోలేనందుకు స్వయంగా కాల్‌ చేసి అంత దూరం రాలేక పోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సాయి తో చాలా సమయం విజయ్‌ దేవరకొండ ఫోన్‌ లో మాట్లాడి ఆశ్చర్య పర్చాడు. సీఏ చదువుతున్న సాయి గురించి పలు విషయాలు తెలుసుకున్నాడు. చదువు గురించి అడిగడం, కెరీర్‌ ప్లానింగ్స్‌ అడిగి తెలుసుకోవడం జరిగింది. సాయి - విజయ్‌ దేవరకొండలు మాట్లాడుకున్న వాయిస్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. విజయ్‌ దేవరకొండ ఒక అభిమానితో మాట్లాడిన తీరుకు మరోసారి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. అందుకే విజయ్‌ దేవరకొండకు ఈ స్థాయిలో యూత్‌ లో క్రేజ్‌ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విజయ్‌ దేవరకొండ ఒక స్టార్‌ లా కాకుండా ఒక అన్నయ్యగా మాట్లాడాడు అనే ఫీలింగ్‌ కలుగుతుందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ అభిమానుల దృష్టిలో మరో మెట్టు ఎక్కాడు.