Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. చూపిస్తాడా సత్తా?

By:  Tupaki Desk   |   15 Aug 2018 3:48 AM GMT
విజయ్ దేవరకొండ.. చూపిస్తాడా సత్తా?
X
సరిగ్గా ఏడాది కిందట ఇదే సమయానికి ‘అర్జున్ రెడ్డి’ ఫీవర్ మొదలైంది జనాల్లో. ఆగస్టు 25న విడుదలైన ఆ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్.. ఇక రిలీజ్ తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అతను నటించిన కొత్త సినిమా ఇంత కాలానికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా బుధవారమే ‘గీత గోవిందం’ విడుదలవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ వచ్చి ఏడాది కావస్తున్నా.. మధ్యలో తన కొత్త సినిమా ఏదీ రాకపోయినా.. తన ఫాలోయింగ్‌ను నిలబెట్టుకోవడంలో విజయ్ తెలివిగా వ్యవహరిస్తూ వచ్చాడు. బయట అతను చూపించి యాటిట్యూడ్.. వివిధ కార్యక్రమాల్లో అతను చేసిన హంగామా.. అన్నీ జనాలకు నచ్చాయి. అభిమానులు అతడితోనే సాగారు.

విజయ్ క్రేజ్ ఎలా ఉందన్నది ‘గీత గోవిందం’కు వచ్చిన హైప్ చూస్తే అర్థమైపోతుంది. ఒక స్టార్ హీరో సినిమా రేంజిలో బుకింగ్స్ జరిగాయి ఈ చిత్రానికి. రెస్పాన్స్ మరీ ఈ రేంజిలో ఉంటుందని చిత్ర బృందం కూడా ఊహించి ఉండదు. ఐతే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని అందుకోవడం కూడా అంత సులువు కాదు. అంచనాలకు తగ్గట్లు లేకపోతే కథ మారిపోతుంది. ఈ రోజుల్లో నెగెటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది. పైగా ఈ చిత్రాన్ని బుధవారం రిలీజ్ చేస్తున్నారు. వీకెండ్ వరకు హోల్డ్ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్తి పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. అదే జరిగితే మాత్రం ‘గీత గోవిందం’ ప్రభంజనం సృష్టించడం ఖాయం. మరి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ ఏ రేంజి హిట్ కొట్టబోతున్నాడు.. అతడి బాక్సాఫీస్ సత్తా ఏంటి.. చూద్దాం మరి.