రెండు సినిమాలు.. ఒకేసారి..

Wed Jun 20 2018 17:35:11 GMT+0530 (IST)

అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ తన అసలు టాలెంట్ ను ఇంకా చూపించలేదు. మధ్యలో ఏ మంత్రం వేసావేకి సైలెంట్ గా ఉన్న విజయ్ మహానటి కి కొంచెం బజ్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా క్రెడిట్ పూర్తిగా కీర్తి సురేష్ కే వెళ్ళిపోయింది. పైగా విజయ్ చేసిన పాత్ర కూడా పెద్దదేమీ కాదు. ఇకపోతే వచ్చే నెలల్లో మళ్ళీ అర్జున్ రెడ్డి రేంజ్ లో ప్రతాపాన్ని చూపాలని అనుకుంటున్నాడు. ఆ సినిమాల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పాలి.ఇక గీత ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా నేడు రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ గీతా గోవిందం అని ముందే తెలిసినప్పటికీ అఫీషియల్ గా చిత్ర యూనిట్ ఈ రోజే తెలిపింది. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రేపు -ప్రీ లుక్ ని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.

ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. అగస్ట్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారట. ఇక నెక్స్ట్ సినిమా టాక్సీ వాలా అయితే ఈ నెలలోనే రిలీజ్ కావాలి. కానీ సిజి వర్క్ వల్ల తేదీని వాయిదా వేయాల్సి వచ్చింది. చూస్తుంటే రెండు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.