Begin typing your search above and press return to search.

ఓవ‌ర్సీస్‌ లో సెగ పుట్టిస్తున్న ద్వారక

By:  Tupaki Desk   |   26 Aug 2016 3:40 PM GMT
ఓవ‌ర్సీస్‌ లో సెగ పుట్టిస్తున్న ద్వారక
X
మ‌న నైజాం కంటే బ‌ల‌మైన మార్కెట్ ఏర్ప‌డింది ఓవ‌ర్సీస్‌ లో. అందుకే తెలుగు సినిమా వ్యాపారానికి సంబంధించిన వేడి ఓవ‌ర్సీస్‌ లోనూ క‌నిపిస్తుంటుంది. క్రేజీ ప్రాజెక్టు అనిపిస్తే చాలు... పోటీలు ప‌డి మ‌రీ సినిమాల్ని కొనేస్తుంటారు. సినిమా ఇంకా సెట్స్‌ పైనే ఉంద‌ని తెలిసినా, రిలీజ్ డేట్లు కూడా ఇంకా ఆమ‌డ‌దూరం ఉన్నాయ‌ని తెలుస్తున్న‌ప్ప‌టికీ ముందుగానే సినిమాల్ని కొనేస్తుంటారు. తాజాగా అలాంటి క్రేజే `ద్వారక‌` విష‌యంలో నెల‌కొంది. `పెళ్ళిచూపులు` హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా కావ‌డంతోనే `ద్వార‌క‌`కి అంత క్రేజ్‌. పెళ్ళిచూపులుకి ఓవ‌ర్సీస్‌ లో విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. మిలియ‌న్ మార్క్ దాటేసి కొత్త చ‌రిత్ర‌ని సృష్టించింది.

ఒక్క‌టంటే ఒక్క సినిమా చేసిన విజ‌య్‌లాంటి ఓ కొత్త హీరో - త‌రుణ్‌ భాస్క‌ర్‌ లాంటి ఓ కొత్త ద‌ర్శ‌కుడు తీసిన సినిమా మిలియ‌న్ డాల‌ర్ల మార్కుని సొంతం చేసుకోవ‌డ‌మంటే ఆషామాషీ కాదు. ఆ సినిమా ఫ‌లితం దృష్ట్యానే `ద్వార‌క‌`కి ఓవ‌ర్సీస్‌ లో పెద్ద‌యెత్తున డిమాండ్ ఏర్ప‌డింది. నిర్మిస్తున్న‌ది కూడా సూప‌ర్‌ గుడ్ ఫిలింస్‌ లాంటి పెద్ద సంస్థ కావ‌డంతో ఆ సినిమాకి మ‌రింత క్రేజ్ నెల‌కొన్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌లే ద్వారక టీజ‌ర్ విడుద‌లైంది.