Begin typing your search above and press return to search.

మహేష్ బాబు రూట్లోనే విజయ్ దేవరకొండ

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:04 AM GMT
మహేష్ బాబు రూట్లోనే విజయ్ దేవరకొండ
X
అర్జున్ రెడ్డితో తన రేంజ్ అమాంతం పెంచేసుకున్న విజయ్ దేవరకొండ ఆపై గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ తో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ కొత్త మూవీ డియర్ కామ్రేడ్ వచ్చే నెలాఖరున విడుదల కానుంది . ఇటీవలే ఫ్రాన్స్ నుంచి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొని హైదరాబాద్ వచ్చిన విజయ్ రాగానే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చూసేశాడు.

కాని ఇంకా అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ కు టైం దొరకలేదట. వైరల్ ఫీవర్ వచ్చిందని అది తగ్గగానే సందీప్ షాహీద్ లు కలిసి మరోసారి ఆ మేజిక్ ని ఎలా సృష్టించారో చూస్తానని చెప్పాడు. కాని విజయ్ దేవరకొండ మాత్రం తాను ఎప్పటికి రీమేకులు చేయను అంటున్నాడు. ఇప్పటిదాకా టాలీవుడ్ లో రీమేకుల జోలికి వెళ్ళని హీరో ఒక్క మహేష్ బాబు మాత్రమే. దానికే కట్టుబడి పాతిక సినిమాల్లో ఒక్కటీ వేరే బాష నుంచి లేకుండా చూసుకున్నాడు.

అయితే మహేష్ సినిమాలు మాత్రం ప్రతి హిట్టు చాలా బాషలలో రీమేక్ అయ్యాయి. విజయ్ దేవరకొండదీ అదే మాట. రీమేకులు తను చేయనని ఇతర హీరోలు వాటి ద్వారా బ్లాక్ బస్టర్లు కొట్టినప్పటికీ తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని తేల్చిచెప్పాడు. సో ఇంకో లాంగ్వేజ్ లో వచ్చిన ఏదైనా హిట్ మూవీ రీమేక్ లో విజయ్ దేవరకొండను చూడలేమన్న మాట. ఏదున్నా ఓన్లీ స్ట్రెయిట్ మూవీస్ అంటున్న విజయ్ దేవరకొండ నిర్ణయం మంచిదే కాని అసలే కథల కొరత ఉన్న పరిశ్రమలో దానికి కట్టుబడి ఉండటం సవాలే