Begin typing your search above and press return to search.

సిగ్గుపడుతూ రష్మికతో డ్యాన్స్ వేసిన రౌడీగారు!

By:  Tupaki Desk   |   15 Oct 2018 7:43 AM GMT
సిగ్గుపడుతూ రష్మికతో డ్యాన్స్ వేసిన రౌడీగారు!
X
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' ప్రేక్షకులను మెప్పించలేదుగానీ అంతకుముందు రిలీజ్ అయిన 'గీతగోవిందం' మాత్రం అందరినీ ఒక ఊపు ఊపింది. ఇంకా చాలామంది 'ఇంకేం ఇంకేం కావలే' హ్యాంగోవర్ లోనే ఉన్నారు. విజయ్ - రష్మిక ల మధ్య కెమిస్ట్రీ అయితే పీక్స్. అదే జంట రీసెంట్ గా జరిగిన మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ 2017 ఫంక్షన్లో స్టేజి మీద తళుక్కున మెరిసింది.

హోస్ట్ విజయ్ - రష్మిక లను ఒక పాటకు డ్యాన్సు చేయమని కోరగా ఒక కన్నడ సాంగ్ ను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేయడం జరిగింది. దీంతో విజయ్ - రష్మిక లు ఒక క్యూట్ స్టెప్ వేశారు. ఎప్పుడూ దూకుడుగా ఉండే రౌడీగారు 'గీత మేడమ్' ని చూసి కాస్త భయపడ్డారో ఏమో గానీ సిగ్గుపడుతూ డ్యాన్స్ వేయడం విశేషం. ఇదిలా ఉంటే రష్మిక మాత్రం తన ఛార్మింగ్ స్టైల్ లో నవ్వుతూ విజయ్ తో కలిసి స్టెప్పేసింది. ఫుల్ వైట్ సూట్ లో విజయ్.. బ్లాక్ సూట్ లో రష్మిక జోడీ అదిరిపోయిందంతే.

'గీత గోవిందం' తర్వాత మరో సారి ఇద్దరూ 'డియర్ కామ్రేడ్' సినిమాలో జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేవరకూ ఈ కన్నడ డ్యాన్స్ బిట్ తో సరిపెట్టుకోండి.. 'ఇంకేం ఇంకేం కావాలే'..!