Begin typing your search above and press return to search.

సమంత క్రాకర్స్.. విజయ్ సెలెబ్రేషన్స్

By:  Tupaki Desk   |   17 Aug 2018 11:18 AM GMT
సమంత క్రాకర్స్.. విజయ్ సెలెబ్రేషన్స్
X
విజయ్ దేవరకొండ.. యాంగ్రీ యంగ్ మ్యాన్ ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఎంత ఇరగదీశాడో చూశాం.. యాంగర్ మేనేజ్ మెంట్ గల విద్యార్థి ఎలా ప్రవర్తిస్తాడో విజయ్ అలా చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసి కలెక్షన్లు కురిపించింది. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ నటన పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. తెలుగులో ఉన్న గొప్ప నటుడిలో విజయ్ ఒకడని అందరూ కీర్తించారు.

అంతటి యాంగ్రీ మ్యాన్ ఇప్పుడు బుద్దిమంతుడిగా మారాడు. గీతాగోవిందంలో ‘గోవింద్’గా పద్ధతైన యువకుడి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. అర్జున్ రెడ్డిలో చూసిన విజయ్ కు.. గీతాగోవిందంలో విజయ్ కు అస్సలు పోలికే లేదు. ఈ తాజా సినిమాలో గోవింద్ గా 100కు 100 మార్కులు కొట్టేసి విజయ్ ఔరా అనిపిస్తున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు, చిరంజీవిలు ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు.

తాజాగా విజయ్ దేవరకొండ నటి సమంత ఫొటో ప్రచురించిన కాకర్స్ ను ట్విట్టర్ లో షేర్ చేసి తన సినిమా విజయవంతంగా ఆడుతున్నందుకు వీటితో సెలబ్రేట్ చేసుకుంటున్నామని రాసుకొచ్చాడు. దీనికి సమంత స్పందించి రీట్వీట్ చేసింది.. ‘గీతా గోవిందం చూశాను.. చాలా బాగుంది. విజయ్, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన ప్రతి సినిమా చూస్తాను.. వీరిద్దరిదీ సూపర్ కాంబినేషన్. వెన్నెల కిషోర్ - రష్మికలతో పాటు చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు’ అని సమంత అభినందించింది.

ఇక సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ లో విజయ్, రష్మి లు అదరగొట్టారని వ్యాఖ్యానించారు. అర్జున్ రెడ్డి విజయ్ అణుకువ ఉన్న యువకుడి పాత్రలో అద్భుతంగా నటించాడని సుశాంత్ ట్వీట్ చేశాడు. ఇలా ‘గీతాగోవిందం’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.