Begin typing your search above and press return to search.

జోరుమీదున్న అర్జున్ రెడ్డి తమ్ముడు

By:  Tupaki Desk   |   22 May 2019 10:31 AM GMT
జోరుమీదున్న అర్జున్ రెడ్డి తమ్ముడు
X
యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండని మంచి ప్లానింగ్ తో రంగంలోకి దించుతున్నాడు. ఇప్పటికే మొదటి సినిమా దొరసాని షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్ కోసం రెడీ అవుతోంది. రాజశేఖర్ చిన్నమ్మాయి శివాత్మికకు సైతం ఇది డెబ్యు కావడంతో రెండు రకాలుగా దీనికి హైప్ వస్తోంది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉండగా దాని బాక్స్ ఆఫీస్ ఏమిటో తేలకుండానే ఆనంద్ కు రెండో ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని టాక్. మధుర శ్రీధర్ నిర్మాతగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా తీసేందుకు అంగీకారం జరిగిపోయిందని తెలిసింది. దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది. పవన్ సాధినేనికి ప్రేమ ఇష్క్ కాదల్ దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే నారా రోహిత్ తో చేసిన సావిత్రి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఎబిసిడి రూపుదిద్దడంలో ఇతని పాత్రా ఉందని మధుర శ్రీధర్ ఓ సందర్భంలో చెప్పారు.

సో అన్ని కుదిరితే దొరసాని రిలీజ్ కు ముందే ఇది సెట్స్ కు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. విజయ్ దేవరకొండ సోదరుడిగా అడుగుపెడుతున్న ఆనంద్ దేవరకొండ ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. దొరసానితో అది నెరవేరుతుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. శుక్రవారం వచ్చే ఫస్ట్ లుక్ లో కొత్త జంట ఎలా ఉండబోతోందనే క్లారిటీ వచ్చేస్తుంది