జొమాటో కోసం క్రేజీ హీరో

Thu Aug 22 2019 13:48:19 GMT+0530 (IST)

జొమాటో అందిస్తున్న ఫుడ్ డెలివరీ సర్వీసెస్ చూస్తుంటే ఓ ఐదారేళ్ళ తర్వాత ఇవి లేకుండా కూడా ఒకప్పుడు జనం తిండి తిన్నారంటే వచ్చే తరాలు నమ్మవేమో. అంతగా ఇవి మన దైనందిక జీవితంలోకి చొచ్చుకు వచ్చాయి. ఒక్క హైదరాబాద్ ప్యారడైజ్ హౌస్ నుంచే రోజు 2 వేల బిర్యానీ పార్సెల్స్ జోమాటో స్విగ్గి లాంటి యాప్స్ ద్వారా డెలివరీ అవుతున్నాయంటే వీటి ప్రభావం పబ్లిక్ మీద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.లక్షల రూపాయల నుంచి వందల కోట్ల టర్న్ ఓవర్ లోకి అడుగుపెడుతున్న ఇలాంటి యాప్స్ ఇప్పుడు మార్కెటింగ్ కోసం సినిమా తారల సహాయం తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే విజయ్ దేవరకొండను తమ బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు జోమాటో తీసుకుంది. ఇప్పటికే ప్రోమోస్ కోసం షూటింగ్ మొదలైపోయిందట. మన హీరోల్లో మహేష్ బాబు ఒక్కడే యాడ్స్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. మిగిలిన హీరోలు కూడా ఇదే తరహ ప్రకటనల్లో నటిస్తున్నప్పటికీ ప్రిన్స్ ఆదరణ మార్కెట్ ఇంకెవరికి లేదన్నది వాస్తవం.

ఇప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న విజయ్  దేవరకొండతో టై అప్ కావడం వల్ల జోమాటో కు రీచ్ ఇంకా బాగా పెరిగే అవకాశం కలిగింది. సుమారు 1 కోటి దాకా విజయ్ దేవరకొండ బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు తీసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇలాంటివి అఫీషియల్ గా తెలిసే ఛాన్స్ లేదు కాని మొత్తానికి కుర్రాడి డిమాండ్ బిజినెస్ సర్కిల్స్ లో భారీగా ఉందట. కాకపోతే ఆచి తూచి వీటిని ఎంచుకుంటున్నాడు విజయ్.