అర్జున్ రెడ్డి పై కేటీఆర్ కామెంట్స్

Tue Aug 29 2017 09:23:27 GMT+0530 (IST)

ఒక సినిమా ప్రమోషన్స్ తో సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లి సక్సెస్ అందుకోవలో నిరూపించారు అర్జున్ రెడ్డి చిత్ర యూనిట్. ఎన్ని వివాదాలు చెలరేగినా అవే కోటి ఆశీర్వాదాలు అన్నట్టుగా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ ని నిర్వహించి. సినిమా కంటెంట్ ఇది అని యువత లో ముందుగానే ఒక పాయింట్ ని ఫిక్స్ చేసి విజయాన్ని అందుకున్నారు. ఇక చూసినవారంతా ఈ తరం దేవదాసు అని ఎవరి స్టైల్ లో వారు పొగుడుతున్నారు.

ఇక టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా సినిమాను చూసి తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే సమంత వంటి వారు కామెంట్ చేయగా ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తనదైన శైలిలో స్పందించారు.  విజయ్ దేవరకొండ నువ్వు రాక్ స్టార్’ అని కామెంట్ చేస్తూ..  ఇది నిజాయతీ కలిగిన అసలైన బోల్డ్ సినిమా అని ట్వీట్ చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డికి మరియు నిర్మాత ప్రణయ్‌కు అభినందనలు కూడా  తెలిపారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పోటీగా ఎన్ని సినిమాలు ఉన్నా ప్రేక్షకుడు మాత్రం అర్జున్ రెడ్డి సినిమాపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారు.

అయితే అర్జున్ రెడ్డి స్టయిల్లో అస్తమానం బూతులతో కూడిన సినిమాలను తీస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? ఇదే కంటెంట్ మళ్ళీ మళ్ళీ తీసిన బోర్ కొడుతుంది. ఈరోజుల్లో సినిమా రాగానే మారుతి స్టయిల్లో ఓ వంద సినిమాలు వచ్చుంటాయ్.. కాని ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. మరి అర్జున్ రెడ్డిని కాపీ కొట్టేద్దాం అనుకున్నవారు అది గుర్తుంచుకోవాలి.