బిచ్చగాడితో ఒకే ఒక్కడు

Thu May 17 2018 14:13:42 GMT+0530 (IST)

జెంటిల్ మెన్-ఒకే ఒక్కడు లాంటి సినిమాల ద్వారా టాలీవుడ్ లో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్షన్ కింగ్ అర్జున్ అడపాదడపా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నా పేరు సూర్యలో బన్నీ తండ్రిగా కనిపించడం ఆ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. గతంలో రామ్ తో రామ రామ కృష్ణ కృష్ణ నితిన్ తో శ్రీ ఆంజనేయం చేసిన అర్జున్ యూత్ హీరోలతో వచ్చే అవకాశాలను అంత సులభంగా వదిలి పెట్టడు. తెలుగులో ఇంకా విడుదల కాని అభిమన్యుడు తమిళ్ వెర్షన్ ఇరుంబుతిరైలో విశాల్ కు ధీటుగా అర్జున్ పండించిన విలనీకి అక్కడ భారీ ప్రశంశలు దక్కాయి. ఇప్పుడు అర్జున్ మీద ఆఫర్ల వర్షం కురుస్తోంది. యాభై వయసులో కూడా బాడీ ఫిట్నెస్ ని మైంటైన్ చేస్తూ హీరోలకు సమానమైన గ్లామర్ ని మైంటైన్ చేస్తున్న అర్జున్ ని ఒప్పించడం అంతే అంత ఈజీ కాదు.కాని విజయ్ అంటోనీ ఈ విషయంలో విజయం సాధించాడు. కొత్త దర్శకుడు ఆండ్రూ రూపొందించబోయే 'కోలైక్కరన్' లో నటించేందుకు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో అర్జున్ కు చాలా కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్టు తెలిసింది. రేపు విజయ్ అంటోనీ నటించిన కాశి తెలుగులో విడుదల కానుంది. తమిళ్ లో కాళి పేరుతో రెండు బాషలలో ఒకేసారి వస్తున్న ఈ మూవీ మీద బిచ్చగాడు హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య తన సినిమాలు తెలుగులో వరసగా నిరాశపరుస్తున్నాయి. నకిలీ నుంచి విజయ్ అంటోనీ ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతోంది. సో అర్జున్ కాంబోలో చేయబోయే మూవీ కూడా తెలుగులో వస్తుంది కాబట్టి సమస్య లేదు. ఇవి కాకుండా రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన గణేష్ రూపొందిస్తున్న 'తిమురు పడిచవన్' తో పాటు నవీన్ దర్శకుడిగా రూపొందుతున్న 'మూడర్ కూడుం' కూడా షూటింగ్ లో ఉంది. వీటికి తెలుగు టైటిల్స్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది