Begin typing your search above and press return to search.

స్నీక్ పీక్: యముడిని చూపించేశాడుగా!!

By:  Tupaki Desk   |   21 Feb 2017 6:38 PM GMT
స్నీక్ పీక్: యముడిని చూపించేశాడుగా!!
X
బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ కొత్త సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మంచి ఆసక్తిని కూడా జనరేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ మరో రెండు రోజుల్లోకి వచ్చేయడంతో.. ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా వేగం పెంచారు.

బిచ్చగాడు బ్లాక్ బస్టర్ తర్వాత.. భేతాళుడు అంటూ జనాల ముందుకు వచ్చాడు విజయ్ యాంటోనీ. సినిమా రిలీజ్ కంటే ముందే.. 10 నిమిషాల మూవీని నెట్ లోకి ఇచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు.. ఓ కీలకమైన పాటను కూడా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. మరీ సూపర్ హిట్ అనేయలేం కానీ.. భేతాళుడు పర్లేదనిపించే స్థాయిలోనే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు యమన్ కి కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు విజయ్ యాంటోనీ. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన యమన్ లోని ఓ కీలకమైన సీన్ ను రిలీజ్ చేశారు.

ఐదు నిమిషాల పాటు సాగే ఈ సీన్.. ఆద్యంతం ఉత్కంఠగా సాగడంతో పాటు హీరోయిజం ఎలివేషన్ కూడా అదిరిపోయింది. నిజంగానే తన కళ్లలో యముడిని చూపించేశాడు విజయ్ యాంటోనీ. ప్రస్తుతం తమిళ్ సీన్ నే ఇచ్చినా.. తెలుగు సీన్ కూడా నెట్లోకి వచ్చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన 5 నిమిషాల సీన్ రేంజ్ లోనే సినిమా మొత్తం తీయగలిగితే మాత్రం.. యమన్ రూపంలో బిచ్చగాడు మళ్లీ కుమ్మేయడం ఖాయం అని చెప్పచ్చు.