Begin typing your search above and press return to search.

విజయ్‌ - అట్లీ మూవీ నేపథ్యం ఇదేనా?

By:  Tupaki Desk   |   16 Nov 2018 1:30 AM GMT
విజయ్‌ - అట్లీ మూవీ నేపథ్యం ఇదేనా?
X
తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తాజాగా ‘సర్కార్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ చిత్రం మిశ్రమ స్పందన దక్కించుకున్నా కూడా దాదాపుగా 200 కోట్ల వసూళ్లను సాధించింది. సర్కార్‌ చిత్రం సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పుడే విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం - పూజా కార్యక్రమాలు చేయడం కూడా జరిగిపోయింది. విజయ్‌ తదుపరి చిత్రం అట్లీతో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటి రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా మంచి వసూళ్లను సాధించాయి.

విజయ్‌ - అట్లీ కాంబో అనగానే అభిమానులు మరియు ప్రేక్షకులు పిచెక్కి పోతున్నారు. అట్లీ ఈమద్య తమిళనాట స్టార్‌ డైరెక్టర్‌ గా దూసుకు పోతున్నాడు. ఇలాంటి సమయంలో వీరిద్దరి కాంబో మూవీ అంటే రికార్డులు మరో సారి బద్దలు కావడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. విజయ్‌ కి ఈ చిత్రం 63వది. తాజాగా ఈ చిత్రం ప్రారంభించినట్లుగా ప్రకటించేందుకు అట్లీ ఒక పోస్టర్‌ ను విడుదల చేయడం జరిగింది. ఎర్రటి ఒక బ్యాక్‌ గ్రౌండ్‌ పై 63వ నెంబర్‌ ను పెద్దగా ముద్రించడం జరిగింది.

ఆ ఎర్రటి బ్యాక్‌ గ్రౌండ్‌ జెర్సీ అని - 63 అనేది జెర్సీ నెంబర్‌ అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. అంటే ఇది క్రీడా నేపథ్యంలో సాగుతుందని ప్రసారం జరుగుతుంది. గతంలో విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎడ్ల పందెల నేపథ్యంలో ఉంటుంది. ఇప్పుడు ఏ క్రీడా నేపథ్యంతో విజయ్‌ 63వ మూవీ ఉంటుందో అంటూ తమిళ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజయ్‌ - అట్లీ త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. వచ్చే దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా అప్పుడే తేదీ కూడా ఫిక్స్‌ చేశారు.