Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ తో కేక పుట్టించాడుగా..

By:  Tupaki Desk   |   21 Jun 2017 5:32 PM GMT
ఫస్ట్ లుక్ తో కేక పుట్టించాడుగా..
X
తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్ బయటికి వచ్చేశాయి. కోలీవుడ్ పెద్ద స్టార్లలో ఒకడైన విజయ్ కొత్త నటిస్తున్న సినిమా టైటిల్ బుధవారం సాయంత్రమే ప్రకటించారు. ఈ చిత్రానికి ‘మెర్సల్’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘ఐ’ సినిమాలో పరేషానయ్యా అంటూ ఓ పాట ఉంటుంది కదా. దాని తమిళ వెర్షన్ ‘మెర్సలాయిటే..’ అం

టైటిల్ సంగతలా ఉంచితే.. ‘మెర్సల్’ ఫస్ట్ లుక్ సూపర్బ్ అన్న అభిప్రాయం కలుగుతోంది. చాలా కాలం నుంచి అర్బన్ బేస్డ్ సినిమాలే చేస్తున్న విజయ్.. ఈసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నట్లుగా ఉంది ఫస్ట్ లుక్ చూస్తే. విజయ్ పాత లుక్ ను గుర్తుకు తెస్తోందిది. ఫస్ట్ లుక్ లాంచ్ కాగానే ఇది వైరల్ అయిపోయింది. ఈ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘తెరి’ తర్వాత అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి మన విజయేంద్ర ప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ‘వివేగం’ ఫస్ట్ లుక్ టీజర్ చూశాక అజిత్ అభిమానులు రెచ్చిపోతున్న నేపథ్యంలో తమ హీరో ఫస్ట్ లుక్ కోసం విజయ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. ఇప్పుడు అజిత్ ఫస్ట్ లుక్.. విజయ్ ఫస్ట్ లుక్ పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలుపెట్టేశారు. రేపు విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇవాళ ‘మెర్సల్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/