Begin typing your search above and press return to search.

వ‌య‌సొచ్చిదంటున్న‌ న‌య‌న్ బాయ్ ఫ్రెండ్‌

By:  Tupaki Desk   |   18 May 2018 11:21 AM GMT
వ‌య‌సొచ్చిదంటున్న‌ న‌య‌న్ బాయ్ ఫ్రెండ్‌
X
లేడీ సూప‌ర్ స్టార్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది న‌య‌న‌తార‌. లేడీ ఒరియెంటెడ్ సినిమాల‌కి కోలీవుడ్లో కేరాఫ్ అడ్రెస్ గా మారిందామె. ఇప్పుడామె విభిన్న పాత్ర‌లో న‌టించిన సినిమా ‘కొల‌మావు కోకిల‌’. కోకో అనేది సంక్షిప్త రూపం. కోలీవుడ్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంటుగా ‘క‌ల్యాణ వ‌య‌సు...’ అనే పాట విడుద‌ల‌య్యి ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

క‌మెడియ‌న్ యోగిబాబు... త‌న చిన్న‌ప్ప‌టి నుంచి ప్రేమించిన అమ్మాయి గురించి న‌య‌న‌తార‌కి చెబుతూ పాడే పాట ఇది. టీనేజ్ వ‌య‌సులో ఉన్న న‌య‌న‌తార లుక్ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఆమె వెన‌క ప‌డుతూ యోగి బాబు చేసే అల్ల‌రి న‌వ్విస్తుంది. ‘కోహ్లికి అనుష్క శ‌ర్మ‌లా నువ్వు నాకు ఫ‌ర్ఫెక్ట్... పెళ్లాడే వ‌య‌సు వ‌చ్చేసింది’ అంటూ సాగే ఈ పాట‌ను త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ రాయ‌డం విశేషం. ఈ పాట విన్న న‌య‌న తార భాయ్ ప్రెండ్ విగ్రేశ్ శివ‌న్... న‌య‌న‌తార‌తో క‌లిసున్న ఫోటోను షేర్ చేస్తూ... ‘థ్యాంక్యూ సో మ‌చ్ అనిరుథ్ అండ్ శివ‌కార్తికేయ‌న్‌... క‌రెక్టు స‌మ‌యంలో క‌రెక్టు పాట విడుద‌ల చేశారు...ఈ పాట కోసం ఎదురుచూస్తున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు. దాంతో పెళ్లాడే వ‌య‌సు వ‌చ్చేసిందంటూ న‌య‌న‌తార‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టేశాడు విగ్నేష్‌.

ఈ సినిమాలో దొంగ‌త‌నంగా డ్ర‌గ్స్ స‌ప్లై చేసే యువ‌తి పాత్ర‌లో న‌టిస్తోంది న‌య‌న‌తార‌. యువ సంగీత సంచ‌ల‌నం అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం రెండు బ‌డా ప్రాజెక్టులు ఒప్పుకున్న న‌య‌న‌తార‌... విగ్నేష్ చేసిన పెళ్లి ప్ర‌తిపాద‌న‌కి ఎప్పుడు ఒప్పుకుంటుందో మాత్రం ఇప్పుడే తెలీదు.

వీడియో కోసం క్లిక్ చేయండి