Begin typing your search above and press return to search.

పద్మావతి లుక్ లో లేడి కమెడియన్

By:  Tupaki Desk   |   25 Sep 2017 12:58 PM GMT
పద్మావతి లుక్ లో లేడి కమెడియన్
X
బాలీవుడ్ లో ఈ మధ్య చారిత్రాత్మక చిత్రాలు బాగానే తెరకెక్కుతున్నాయి. పీరియాడిక్ డ్రామాలతో నటి నటులు తమను తాము నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఎన్ని సినిమాల్లో నటించినా అటువంటి సినిమాల్లో నటించే అవకాశం ఎక్కువగా రాదు. దీంతో ఎంత పెద్ద తారలైనా చెయ్యడానికి సై అంటున్నారు. ఒకవేళ కాన్సప్ట్ నచ్చకుంటే చేంజెస్ చేసుకొని మరి సెట్స్ పైకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయిత్ ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకొనె "పద్మావతి" అనే సినిమాలో నటిస్తోంది. 160 కోట్లతో ఈ సినిమాను సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్నాడు. అలాగే షాహిద్ కపూర్ - రన్ వీర్ సింగ్ లు సినిమాలో స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు సంజయ్ సినిమాలో లీడ్ రోల్ లో చేస్తోన్న దీపికా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అంచనాలను పెంచాడు. ఎప్పుడు గ్లామర్ గర్ల్ గా మెరిసిపోయే దీపికా పద్మావతి పాత్రలో నిండుగా సాంప్రదాయ పద్దతిలో కనిపిస్తోంది.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే పద్మావతి ఫస్ట్ లుక్ ప్రస్తుతం అందరిని అక్కట్టుకుంటోంది. అయితే ఆ పోస్టర్ లో ఉన్న తరహాలోనే కొంచెం తన పద్దతిలో ఒక తమిళ కమెడియన్ లుక్ ఇచ్చింది. దీపికా ఎలా కనిపిస్తుందో అలా తాను కూడా కనిపించాలని లేడి కామెడీయన్ విద్యు లేఖ రామన్ స్టిల్ ఇచ్చింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యు ఇలా కూడా నవ్విస్తోందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.