Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కి డర్టీ జోడీ ఖాయమైందా?

By:  Tupaki Desk   |   21 Feb 2017 5:12 AM GMT
సూపర్ స్టార్ కి డర్టీ జోడీ ఖాయమైందా?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు రోబో సీక్వెల్ 2.0 మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు కల్లా ఈ సైంటిఫిక్ థ్రిల్లింగ్ మూవీ పిక్చరైజేషన్ పూర్తి కానుండగా.. రిలీజ్ కి మాత్రం చాలానే టైం పట్టనుంది. ఈ ఏడాది దీపావళి పండుగకు కానీ.. 2.0 వెలుగుచూసే అవకాశం లేదు.

అయితే.. ఈ లోపుగానే రజినీ మాత్రం తన మరుసటి చిత్రాన్ని ప్రారంభించేస్తారు. తన ప్రతీ చిత్రంలో బాలీవుడ్ భామలను హీరోయిన్లుగా ఫైనల్ చేస్తున్న రజినీకాంత్.. ఈ సినిమాకు కూడా బాలీవుడ్ భామనే తీసుకొచ్చారట. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. రజినీ పక్కన నటించే అవకాశం రావడంతో.. ఈ డర్టీ పిక్చర్ భామ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి రజినీ-పా రంజిత్ కాంబినేషన్ కావడంతో.. కబాలికి ఈ మూవీ సీక్వెల్ అని ప్రచారం జరుగుతున్నా.. అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని రజినీకాంత్ అల్లు ధనుష్ నిర్మించనుండగా.. సూపర్ స్టార్ నెక్ట్స్ మూవీ.. మే నెలలో ప్రారంభం కానుంది. ప్రారంభం సమ్మర్ లో అయినా.. ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కల్లా రిలీజ్ చేసేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/