Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ ఇందిరమ్మ ప్లాన్స్!

By:  Tupaki Desk   |   23 Aug 2019 2:19 PM GMT
స్టార్‌ హీరోయిన్‌ ఇందిరమ్మ ప్లాన్స్!
X
భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఇందిరా గాంధీ. ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి ఉక్కు మనిషిగా కీర్తించబడ్డ నాయకురాలు ఈమె. అందుకే ఆమె జీవితం గురించి ఎంత చెప్పినా కూడా కొంత మిగిలే ఉంటుంది. ప్రేక్షకులు ఇందిరా గాంధీ గురించి ఎంత తెలుసుకునా కూడా కొత్త సినిమా వస్తుందన్నా లేదంటే కొత్త పుస్తకం వస్తుందన్నా కూడా ఆసక్తిని కనబర్చుతూనే ఉంటారు. అందుకే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ కూడా ఇందిరమ్మ బయోపిక్‌ ను చేసేందుకు ఆసక్తిగా ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్స్‌ వెబ్‌ సిరీస్‌ ల వెంట పడుతున్నారు. రాబోయే కాలం మొత్తం వెబ్‌ సిరీస్‌ దే అన్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యాబాలన్‌ కూడా వెబ్‌ సిరీస్‌ ల నిర్మాణంకు సిద్దం అయ్యింది. తాజాగా విద్యాబాలన్‌ ఇందిరా గాంధీ బయోపిక్‌ గురించి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఇందిరా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం హక్కులు కొనుగోలు చేశాను. ఆ సమయంలో వెబ్‌ సిరీస్‌ గా తీయాలనే ఆలోచన నాకు లేదు. కాని ఇందిరా గాంధీకి సంబంధించిన అన్ని విషయాలను కవర్‌ చేయాలంటే వెబ్‌ సిరీస్‌ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాను.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చేయిస్తున్నట్లుగా పేర్కొన్న విద్యాబాలన్‌ త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ ఎప్పుడు వచ్చేది క్లీయర్‌ గా చెప్పలేనని అయితే వచ్చే రెండేళ్లలో వెబ్‌ సిరీస్‌ ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ వెబ్‌ సిరీస్‌ లో ఇందిరమ్మ పాత్రను విద్యాబాలన్‌ చేసే అవకాశం ఉంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు వెబ్‌ సిరీస్‌ లను నిర్మిస్తూ వాటిలో నటించేందుకు విద్యాబాలన్‌ సిద్దమవుతోంది. ఈమె కొత్త జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.