బసవతారకం పాత్ర లో ఆసక్తిని చూశా!

Mon Jul 16 2018 21:21:10 GMT+0530 (IST)

ఇపుడు విద్యాబాలన్‌కు కొత్త పేరు పెట్టేశారు... బయోపిక్ భామ అని. సిల్క్ స్మిత బయోపిక్ ‘డర్టీ పిక్చర్’తో దేశంలో ఒక కొత్త సంచలనం సృష్టించిన విద్యాబాలన్ కొత్త క్రేజును సంపాదించుకుంది. అందులో ఆమె ఫర్ ఫామెన్స్‌కు పెద్ద సంఖ్యలో బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. కానీ... ఆమె ఆ తప్పు చేయలేదు. మొనాటనీ నుంచి జాగ్రత్తగా బయటపడింది.  ఆ తర్వాత ఇతర సినిమాలతో నటనలో వైవిధ్యం చూపించిన విద్యా బాలన్ తాజాగా ‘యన్.టి.ఆర్’ బయోపిక్ లో నటించడానికి అంగీకరించింది. ఇది ఒక సినిమా స్టార్ బయోపిక్ మాత్రమే కాదు జీవితంలో ఎన్నో మలుపులున్న మాజీ ముఖ్యమంత్రి కథ. అలాంటి సంచలన వ్యక్తి జీవిత కథతో ఆమె తెలుగులో తొలి సినిమా చేస్తోంది.ఎన్టీఆర్ పాత్రలో ఆయన కొడుకు బాలకృష్ణ నటిస్తుండగా... తన కంటే చిన్నవాడైన వ్యక్తికి తల్లి పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం పాత్రను ఆమె పోషిస్తోంది. దీనిపై విద్యా బాలన్ స్పందించారు. తెలుగు అభిమానుల్లో ఎన్టీఆర్ ఎంతో పాపులర్ కానీ.. అంత పాపులర్ నటుడు - నాయకుడి భార్య గురించి చాలా తక్కువ మందికి తెలియడం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే ఆ పాత్రపై నాకు చాలా ఆసక్తి కలిగింది అని ఆమె వ్యాఖ్యానించారు.

సిల్క్ స్టోరీ తర్వాత చాలామంది జీవిత కథల ఆఫర్స్ మీకు వచ్చాయట... అవన్నీ కాదని ఎన్టీఆర్ కు ఎందుకు ఒప్పుకున్నారు? అని మీడియా ఆమెను ప్రశ్నించింది.  “ఇది ఎన్టీఆర్ బయోపిక్. బసవతారకం బయోపిక్ కాదు. బసవతారకం ఎన్టీఆర్ కాదు - ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర ఆమెది. ఆ పాయింటే నన్ను ఈ పాత్రలో ఆకర్షించింది... అని విద్యాబాలన్ తెలిపింది. మొత్తానికి తెలుగు వారికి బాగా తెలిసిన ఒక పేరు వెనుక కథను ఆమె ఆవిష్కరించనున్నారు బసవతారకం పాత్రలో. మరి ఎలా ఆకట్టుకుంటారో చూద్దాం. ఇప్పటికే జరుగుతున్న ఎన్టీఆర్ షూటింగులో విద్య బుధవారం నుంచి పాల్గొంటారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.