Begin typing your search above and press return to search.

ప్రమాదం నుంచి హీరోయిన్ ఎస్కేప్

By:  Tupaki Desk   |   29 Sep 2017 11:33 AM GMT
ప్రమాదం నుంచి హీరోయిన్ ఎస్కేప్
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఉహించని విధంగా ఆమెకు ప్రమాదం ఎదురవడంతో అందరూ షాక్ అయ్యారు. బుధవారం రోజు ఓ ప్రముఖ ఈవెంట్ లో పాల్గొనడానికి బాంద్రాకు తన కారులో బయలు దేరింది విద్యా బాలన్. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ఆమె ప్రయాణిస్తున్న కారు మరొక కారుని ఢీ కొట్టింది.

దీంతో ఒక్కసారిగా చుట్టుపక్కల జనం అంతా ప్రమాద ఘటనకు చేరుకున్నారు. విద్యాబాలన్ కి ఎటువంటి గాయాలు కాకపోవడం.. డ్రైవర్ కూడా క్షేమంగా బయటపడ్డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యా బాలన్ ను మరొక కారులో అక్కడినుంచి పంపించేశారు. ఇక విద్యాబాలన్ కారు కొద్దిగా డ్యామేజ్ అయ్యిందని ఆమె డ్రైవర్ తెలిపాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. కొందరు సినీ ప్రముఖులు విద్యకు ఫోన్ చేసి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. తనకు ఏం కాలేదని క్షేమంగా ఉన్నానని విద్యా వెల్లడించింది.

ఇక విద్యా బాలన్ ప్రస్తుతం ‘తుమ్హారీ సులు’ అనే సినిమాను చేస్తోంది. అందులో లేట్‌ నైట్‌ ఆర్జే పాత్రలో కనిపించనుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. సురేష్ త్రివేణి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 24న రిలీజ్ కానుంది. విద్యా బాలన్ ఇంతకుముందు నటించిన బేగమ్ జాన్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.