Begin typing your search above and press return to search.

విద్యా బాలన్-మనసులు దోచెన్

By:  Tupaki Desk   |   21 Jan 2018 4:32 AM GMT
విద్యా బాలన్-మనసులు దోచెన్
X
అన్ని రకాల పాత్రలు చేస్తూ ఎవరికి అంతు చిక్కని రీతిలో దూసుకుపోతున్న విద్యా బాలన్ ఇటీవలే విడుదలైన తుమారీ సులు సినిమాతో మరోసారి క్రిటిక్స్ ను కూడా మెప్పించింది. కహాని మూవీ ద్వారా తనలో బెస్ట్ యాక్టింగ్ యాంగిల్ ని ప్రపంచానికి పరిచయం చేసిన విద్యా బాలన్ డర్టీ పిక్చర్ ద్వారా తనలో మరో కోణాన్ని కూడా చూపించి శభాష్ అనిపించుకుంది. గ్లామర్ హీరొయిన్లకు ప్రధానంగా ఉండాల్సిన హైట్ విషయంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తన యాక్టింగ్ టాలెంట్ తో బాలీవుడ్ లో నెగ్గుకువస్తున్న విద్యా బాలన్ తనను పూర్తిగా హోమ్లీ బ్యాచ్ కింద కట్టేయకండని అప్పుడప్పుడు హింట్ ఇస్తూనే ఉంటుంది. అవకాశం కలిగినప్పుడు బోల్డ్ గా ఉండడానికైనా సిద్ధంగా ఉన్నానని ఇలాంటి ఫోటోలా ద్వారా చెబుతూనే ఉంటుంది.

పైన చూస్తున్న స్టిల్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్తాని క్యాలెండర్ కోసం విద్యా బాలన్ ఇచ్చిన ఫోజు. కురులు మొత్తం విరబోసుకుని నల్లని డ్రెస్ లో టాప్ హాఫ్ లో క్లీవేజ్ బాగా కనిపించేలా కసి నిండిన కళ్ళలో అలా చూస్తే ఎవరికైనా మతి పోవడం ఖాయంగా కనిపిస్తోంది కదూ. 19 ఏళ్ళ నుంచి డబ్బూ రత్తాని రూపొందిస్తున్న ఈ క్యాలండర్ లో స్టిల్ ఇవ్వడం కోసం టాప్ మోడల్స్, హీరొయిన్స్ పోటీ పడి మరీ తమ అందాలను ఒలకబోస్తారు. మానుషి చిల్లార్ - ఐశ్వర్య రాయ్. అలియ భట్ - శ్రద్ధా కపూర్ - కత్రినా కైఫ్ ఇలా లిస్టు పెద్దదిగానే ఉంది లేండి. వాళ్ళు హాట్ ఫోజులు ఇవ్వడం కామనే కాని విద్యా బాలన్ ఇలా ఇవ్వడమే స్పెషల్.

తుమరి సులు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న విద్యా బాలన్ ఇందిరా గాంధీ పై సాగరిక ఘోష్ రచించిన ఇందిరా-ది ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆధారంగా రూపొందే సినిమాలో టైటిల్ రోల్ పోషించేందుకు తన సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.