Begin typing your search above and press return to search.

సెక్స్ వర్కర్ గా మారిపోయిన చిన్నది

By:  Tupaki Desk   |   28 March 2017 5:54 PM GMT
సెక్స్ వర్కర్ గా మారిపోయిన చిన్నది
X
నితిన్ మూవీ చిన్నదాన నీకోసం చిత్రంతో మూడేళ్ల క్రితం టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ మిష్టి చక్రవర్తి. ఆ తర్వాత కొలంబస్ అంటూ మరోసారి కనిపించింది కానీ.. ఇక్కడ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇప్పుడు విద్యాబాలన్ మూవీ బేగమ్ జాన్ లో నటించిన ఈ చిన్నది.. ఆ మూవీలో విద్యాబాలన్ తర్వాత సెంట్రాఫ్ అట్రాక్షన్ అయిపోనుందట. బేగమ్ జాన్ మూవీ అంతా ఓ వేశ్యాగృహం చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. పలువురు భాగలు వేశ్యలుగా ఈ సినిమాలో కనిపించనుండగా.. వీరిలో మిష్టి కూడా ఓ రోల్ చేసింది. ఈ సినిమాలో పలు ఇంటిమేట్ సీన్స్ లో ఈ భామ నటించగా.. వీటిలో నసీరద్దీన్ షాతో పడకగది సన్నివేశాలను పండించేసిందట. ఈ మూవీలో విద్యా బాలన్ తర్వాత అంతటి కేరక్టర్ తో పాటు.. పేరు ప్రఖ్యాతులు కూడా మిష్టికే దక్కుతాయని చెబుతున్నారు.

ఈ వేశ్య పాత్ర కోసం ఈ భామ బాగా కష్టపడిందట కూడా. ఏకంగా రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి మరీ.. పలువురు వేశ్యలను ఇంటర్వ్యూలు కూడా చేసిందట. ఈ బోల్డ్ కేరక్టర్ తో ఆడియన్స్ ను తెగ ఇంప్రెస్ చేయనుందట మిష్టి చక్రవర్తి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/