Begin typing your search above and press return to search.

బ్రా గురించి డ‌ర్టీ కామెంట్?

By:  Tupaki Desk   |   13 Feb 2019 12:00 PM GMT
బ్రా గురించి డ‌ర్టీ కామెంట్?
X
బోల్డ్ గా ఉండ‌డం కొంద‌రికి వెన్న‌తో పెట్టిన విద్య‌. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఇలాంటివి చాలా స‌హ‌జం అనుకుంటే... కాస్త మ‌రికాస్త‌ ర‌ఫ్ గా.. ర‌గ్గ్ డ్ గా.. న్యూడ్ గా.. ఆడ్ గా.. ఉంటేనే ప‌న‌వుతుంది అన్న‌ట్టే ఉంటుంది కొంద‌రి వాల‌కం. ఈ ఫార్ములాని ఉప‌యోగించుకుని బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది సీనియ‌ర్ న‌టి విద్యాబాల‌న్. ఒకే ఒక్క `డ‌ర్టీ పిక్చ‌ర్` తో డ‌ర్టీ గాళ్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌రైన బాల‌న్ అంత‌కుముందు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో ర‌గ్గ్ డ్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. లిప్ లాక్ లు.. బెడ్ రూమ్ .. బాత్రూమ్ స‌న్నివేశాల‌కు అడ్డు చెప్ప‌కుండా చెల‌రేగిన సినిమాలు ఉన్నాయి. కార‌ణం ఏదైనా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో నియ‌మ‌నిబంధ‌న‌లు చెల్ల‌వు అన‌డానికి బాల‌న్ యాక్టివిటీస్ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

అయితే పై వ్యాప‌కాలేవీ లేకుండా ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్ లో డీసెంట్ గా బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టించి మెప్పించారు బాల‌న్. తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, అటు బాలీవుడ్ ఆడియెన్ కి ఇదో స‌ర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. త‌న మాట‌.. చేతలు.. వ్య‌వ‌హారికం ప్ర‌తిదీ కాస్త ర‌ఫ్ గానే ఉంటుంద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ తుమ్హారీ షులూ చిత్రంలోనూ బాల‌న్ లుక్, న‌ట‌న అంతే మైమ‌రిపించాయంటే త‌న లోని ఒరిజినాలిటీ ఆ క్యారెక్ట‌ర్ కి సూట‌య్యింది కాబ‌ట్టి. ఇక క‌హానీ లాంటి చిత్రంలో బాల‌న్ డీసెంట్ పెర్ఫామెన్స్ త‌న‌లోని న‌టికి మంచి ఎగ్జాంపుల్.

అదంతా అటుంచితే తాజాగా ఫిలింఫేర్ ఉత్స‌వాల్లో బాల‌న్ చేసిన ఓ కామెంట్ యూత్ కి దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. ఈ ఉత్స‌వాల్లో రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల వేళ బాల‌న్ కి ఎదురైన ఓ ప్ర‌శ్న‌కు అంతే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చి అంద‌రికీ షాకిచ్చారు. అన్ని వేళ‌లా మ‌గువ‌లు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అన్న ప్ర‌శ్న‌కు.. ఏమాత్రం త‌డుముకోకుండా ``పెర్ఫెక్ట్ బ్రా.. అది చాలా ఇంపార్టెంట్!`` అంటూ బోల్డ్ గా త‌న‌దైన శైలిలో చెప్పేస్తూ న‌వ్వ‌డం కుర్ర‌కారుకు ఎక్క‌డో తాకింది. ``పెర్ఫెక్ట్ బ్రాతో పాటు రెండు జ‌త‌ల బ్లూ జీన్స్.. ల‌వ్ లీ కాట‌న్ శారీ వెంట ఉండాల్సిందే``న‌ని బాల‌న్ సెల‌వివ్వ‌డం ఆస‌క్తిక‌రం. మొత్తానికి ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఇక వేరొక వీడియోలో సోన‌మ్ క‌పూర్ స్పెష‌ల్ డిజైన‌ర్ ఎలిజ‌బెత్ క్వీన్ లుక్ వీడియో ఆక‌ట్టుకుంది.

For Video Click Here