ఫోటో స్టొరీ: డర్టీ పిక్చర్ ఈజ్ బ్యాక్!

Tue Jun 11 2019 16:06:12 GMT+0530 (IST)

విద్యా బాలన్ గురించి తెలియని సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. బాలీవుడ్ లో ఆమె నటించిన 'డర్టీ పిక్చర్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  'పరిణీత' లాంటి ఎన్నో క్లాస్ ఫిలిమ్స్ లో నటించినా రాని గుర్తింపు విద్యా బాలన్ కు 'డర్టీ పిక్చర్' తో వచ్చేసింది.  గ్లామర్ లేదు.. హాట్ నెస్ లేదు అని తనపై ఉన్న విమర్శలను ఒక్కసారిగా చెరిపేసింది.  వివాహం తర్వాత కూడా లీడ్ రోల్స్ లో నటిస్తూ తన సత్తా చాటుతోంది విద్య.  రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే కదా.  సినిమా ఫ్లాప్ అయినా బసవతారకం పాత్రలో విద్యా నటనకు ప్రశంసలు దక్కాయి.ఇదిలా ఉంటే విద్యా ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉంది. దీంతో అక్కడ బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీయించుకుంది. బీచ్ అనగానే ఎవరైనా బికినీలు.. మోనోకినిలు.. మైక్రోలు.. మినీలు అని రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు. కానీ విద్యా బాలన్ మాత్రం కొత్తరకం గౌన్ వేసుకుంది.  ఆ గౌన్ శరీరాన్ని మొత్తం కవర్ చేసేదే. కానీ అక్కడ ఉండేది బాలన్ గారు కదా? అందుకే ఆమెలోని డర్టీ యాక్ట్రెస్ నిద్ర లేచింది.  అందుకే ఆ డ్రెస్సును లుంగీ తరహాలో పైకి కట్టి ముడేసుకుంది.  అంతటితో ఆగకుండా అలలలో అలవోకగా తన అందాలను పూర్తిగా ధారపోస్తూ ముందుకు వంగింది. ఎంత వస్త్రం అయినా...అలా ఒంగితే అందాలను అల్లరి నెటిజనుల కళ్ళపడకుండా ఎలా కాపాడగలుగుతుంది?  బాలన్.. నీకో దణ్ణం.. నీ డర్టీ పోజులకో నమస్కారం అంటూ ఆ వస్త్రం పూర్తిగా చేతులెత్తేసింది.  నెటిజనులకు సర్వదర్శనం జరిగిపోయింది.

ఈ దర్శనానికి బాలన్ గారు ఇచ్చిన క్యాప్షన్ 'జాయ్'. అలా పోజిచ్చిన ఆమెకే అంత జాయ్ ఉంటే.. చూసిన కళాపోషకులకు డబల్ జాయ్ ఉంటుంది కదా.  ఇదే ఫోటోలో కనుక విద్యా బాలన్ స్థానంలో మరొకరు ఉంటె నెటిజనులు ట్రోలింగ్ మొదలు పెట్టేవారు.  బీచ్ లో ఆ బట్టలేంటి.. ఎర్రబస్సు ఎక్కి వచ్చావా అంటూ ఎకసెక్కాలు ఆడిఉండే వారు. కానీ బాలన్ వారికి  అంత ఛాన్సు ఇవ్వలేదు.  "మూసుక్కోచో పూల చొక్కా" అన్నట్టుగా తన పోజుతో అందరి నోళ్ళు మూయించింది.  అసలు ఇంకో డౌట్ ఏంటంటే.. ఆ రీల్ బసవ తారకం ఈవిడేనా? ఈవిడ ఆవిడ పాత్రలోకి ఎలా పరకాయ ప్రవేశం చేసింది.  ఇంత ఇండీసెంట్ లేడీ అంత డీసెంట్ గా ఎలా కనిపించింది?  అక్కడే కదా బాలన్ గారి నటనా కౌశలం మనకు అర్థం అయ్యేది! ఇక బాలన్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం  'మిషన్ మంగల్' లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా 'నేర్కొండ పార్వై' అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.