జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి

Tue Jun 12 2018 11:47:19 GMT+0530 (IST)

బయోపిక్ అంటే చాలు జనాలు అసలు కథ ఏమై ఉంటుందని ముందే రీసెర్చ్ చేసేస్తుంటారు. ఆ నిజమైన కథను తెరపై ఎలా చూపిస్తారా అనే విషయం కూడా అందరిలో ఆసక్తిని రేపుతోంది. సినిమాలకు బయోపిక్ లకు వ్యత్యాసం చాలా ఉంటుంది. ఇకపోతే మొదట్లో బయోపిక్ లంటే భయపడిన వారే ఇప్పుడు అవకాశం వస్తే రెడీ అంటున్నారు. కోలీవుడ్ లో దివగంత జయలలితపై ఒక బయోపిక్ ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.సిసిఎల్ సృష్తికర్త విష్ణు ఇందూరి నిర్మాణంలో ఆ బయోపిక్ రానుంది. తెలుగులో ఆల్ రెడీ వీరి బ్యానర్ ను ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జయలలిత ప్రాజెక్ట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని ప్లాన్స్ వేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇక జయలలిత క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే జయలలిత కెరీర్ మొత్తం చాలా వివాదాలతో కూడుకున్నది. ఏ మాత్రం తేడా వచ్చిన తమిళ ప్రజల ఆగ్రహాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. జయలలిత మీద ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చిన్నప్పటికీ ఆమెకున్న ఫాలోవర్స్ ఏ మాత్రం తగ్గలేదు. జనాల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ బయోపిక్ ను జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.