Begin typing your search above and press return to search.

శ్రీముఖి ఐలవ్యూ చెప్పింది ఎందుకంటే

By:  Tupaki Desk   |   22 Nov 2017 8:04 AM GMT
శ్రీముఖి ఐలవ్యూ చెప్పింది ఎందుకంటే
X
ట్విట్టర్ లో ప్రస్తుతం సినీ తారల హవా ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు ఫెస్ బుక్ ని తెగ వాడేసిన సినీ ప్రేక్షకులు కూడా ఇప్పుడు వారి అభిమాన తారలు ఎక్కువగా ట్విట్టర్ లో ఉన్నారని అందులోకి షిఫ్ట్ అవుతున్నారు. సెలబ్రెటీలు కూడా ఎప్పటికపుడు అప్డేట్స్ ఇస్తూ.. వారిని ఖుషి చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఇద్దరి సినీ తారల సంభాషణ ట్విట్టర్ లో అందరిని ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం టాప్ కామెడియన్స్ లో ఒకరిగా ఉన్న వెన్నల కిషోర్ అలాగే టాప్ యాంకర్స్ జాబితాలో ఒకరైన శ్రీ ముఖి ఇద్దరు ట్విట్టర్ లో కొంచెం అల్లరిగా సంబాషించుకున్నారు. అయితే ముందుగా వెన్నెల కిషోర్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ..మై కరేబియన్‌.. మై కామారెడ్డి’అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే శ్రీ ముఖి కూడా ఫొటో పై స్పందిస్తూ.. మనది అని కామెంట్ చేశారు. అయితే ఇంతలో ఓ నెటిజన్ శ్రీ ముఖి యాంకరింగ్ చాలా బావుంటుందని ట్వీట్ చేయగా.. వెంటనే వెన్నెల కిశోర్ స్పందించాడు.

'ఆమె రాక్ స్టార్.. 400k ట్విటర్‌ ఫాలోవర్స్‌ .. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది’ అని అన్నారు. అందుకు శ్రీముఖి ప్రతిస్పందిస్తూ.. ‘ఐలవ్యూ .. మీ ట్వీట్స్ చూడగానే నా కీప్యాడ్‌ కేవలం ఆ వర్డ్ నే టైప్‌ చేస్తుంది’ అని చెప్పడంతో వెంటనే వెన్నెల కిశోర్‌.. ‘నేను సిగ్గుపడిన ప్రతిసారి నా బుగ్గలు ఎర్రగా అవుతాయని అనుకుంటా. కానీ అలా జరగదు.. అవి అలాగే చామనఛాయలో ఉంటాయి’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీంతో నెటిజన్స్ కూడా వీరి సంబాషణపై ఎవరికీ తోచినట్టు వారు ఫన్నీగా ట్వీట్ చేస్తున్నారు.