Begin typing your search above and press return to search.

తేజు-వెన్నెల కిషోర్.. ఆట బాగుంది

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:52 AM GMT
తేజు-వెన్నెల కిషోర్.. ఆట బాగుంది
X
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ఈజీ గోయింగ్ అన్న పేరుంది. ఇండస్ట్రీలో అతడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా కమెడియన్లు వెన్నెల కిషోర్.. సత్య లాంటి వాళ్లతో ఈ మెగా హీరోకు మంచి సాన్నిహిత్యం ఉంది. తేజు-వెన్నెల కిషోర్ ఒక చోట చేరారంటే రచ్చ మామూలుగా ఉండదు. షూటింగ్ స్పాట్లో ఉన్నవాళ్లందరికీ మంచి కాలక్షేపం చేయించేస్తారట ఇద్దరూ. ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ.. అల్లరి అల్లరి చేస్తూ సందడి వాతావరణం ఉండేలా చేస్తారట వీళ్లిద్దరూ. షూటింగ్ స్పాట్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా వీళ్లిద్దరూ మంచి వినోదాన్నే పంచుతుంటారు.

తాజాగా తేజు.. వెన్నెల కిషోర్ కలిసి నటిస్తున్న ‘విన్నర్’ సినిమాకు సంబంధించి వీళ్లు షేర్ చేసిన ఫొటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా నైట్ షూటింగ్ చేస్తున్నాడట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. దీని గురించి వీళ్ల ఫీలింగ్స్ చెబుతూ వెన్నెల కిషోర్ షేర్ చేసిన ఫొటో భలే ఫన్నీగా ఉంది. మళ్లీ నైట్ షూటింగా.. చచ్చాం పో అని వీళ్లిద్దరూ ఫీలింగ్ పెట్టడం.. డైరెక్టర్ గోపీచంద్ వచ్చి.. ఎల్లుండి నైట్ షూటింగ్.. ఓకే కదా అంటూ అడగడం.. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా సరదాగా ఉంది. వెన్నెల కిషోర్ సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంత ఫన్నీగా ఉంటాడో చెప్పడానికి ఇది నిదర్శనం. తేజు-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘విన్నర్’ షూటింగ్ ఆల్రెడీ సగం పూర్తయింది. ప్రస్తుతం కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/