Begin typing your search above and press return to search.

డిజే స్పిన్నర్ తో దృష్టికి లింక్

By:  Tupaki Desk   |   20 Jan 2018 2:55 PM GMT
డిజే స్పిన్నర్ తో దృష్టికి లింక్
X
చాలా కాలం తర్వాత రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన దృష్టి ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో ఇందులో స్పష్టంగా చెప్పేసారు. ఫోటోగ్రాఫర్ అయిన హీరో అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు.అందులో అనుమానితుడిగా రాహుల్ తో పాటు వెన్నెల కిషోర్ కూడా ఉంటాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా సత్య ప్రకాష్ చాలా రోజుల తర్వాత ఎక్కువ స్పాన్ ఉన్న పాత్ర పోషించినట్టు కనిపిస్తోంది. ఇందులో కొన్ని సన్నివేశాలకు లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాల రిఫరెన్స్ ఇవ్వడం ఇందులో ఆకట్టుకుంటోంది. ఒక సీన్లో సత్య ప్రకాష్ వెన్నెల కిషోర్ చేతిలో ఉన్న స్పిన్నర్ గురించి ఇదేంటి అని అడిగితే నాకేం తెలుసు డిజే ఫంక్షన్ లో అల్లు అర్జున్ వాడితే నేను కూడా కొనుకున్నాను అని చెప్పడం భలేగా పేలింది.

ట్రైలర్ చివర్లో సత్య ప్రకాష్ భారతం నుంచి బాహుబలి దాకా అన్ని యుద్ధాలకు కారణం ఆడదే అని చెప్పే ఫినిషింగ్ టచ్ బాగుంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా సోలో హీరోగా హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాహుల్ రవీంద్రన్ దృష్టి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అందాల రాక్షసి, టైగర్ లాంటి సినిమాలు బాగానే ఆడినా రాహుల్ కు వచ్చిన పేరు తక్కువే. అందుకే దృష్టి సోలో హిట్ తో ట్రాక్ లో పడాలని చూస్తున్నాడు.

రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో పావని గంగిరెడ్డి హీరొయిన్. తను ఎవరు అనుకుంటున్నారా. మళ్ళి మళ్ళి ఇది రాని రోజులో నిత్య మీనన్ క్లోజ్ ఫ్రెండ్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆర్టిస్ట్ తనే. జ్యో అచ్యుతానందలో కూడా నారా రోహిత్ కు జోడిగా నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దృష్టితో వీళ్ళంతా అందరి దృష్టిలో పడతారో లేదో విడుదల అయ్యాక తెలుస్తుంది.