Begin typing your search above and press return to search.

హాస్య బ్ర‌హ్మీ త‌ర్వాత ఒకే ఒక్క‌డు

By:  Tupaki Desk   |   19 Sep 2019 10:10 AM GMT
హాస్య బ్ర‌హ్మీ త‌ర్వాత ఒకే ఒక్క‌డు
X
బ్ర‌హ్మానందం త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి క‌మెడియ‌న్ ఎవ‌రున్నారు? అంటే ట‌కీమ‌ని పేరు చెప్ప‌లేని ప‌రిస్థితి. బ్ర‌హ్మానందం-అలీ- వేణుమాధ‌వ్ వీళ్లంతా వెళ్లాక‌.. సునీల్ హీరో గా షిఫ్ట‌య్యాక‌.. సీనియ‌ర్ క‌మెడియ‌న్లు ఎవ‌రూ లేని స‌మ‌యంలో రైట్ టైమింగుతో ఎంట‌ర‌య్యాడు వెన్నెల కిషోర్. అత‌డి హ‌వా ఓ రేంజులో సాగింది. ఇప్ప‌టికీ సాగుతోంది. ఇప్పుడున్న క‌మెడియ‌న్ల‌లో వెన్నెల కిషోర్ ప్ర‌తిభ‌ను ఏమాత్రం త‌క్కువ చేసి చూడ‌లేం. బ్ర‌హ్మీ స్ఫూర్తితో వ‌చ్చాన‌ని చెప్పే వెన్నెల ఆ స్ఫూర్తిని నిల‌బెడుతున్నాడు. ఎదురు లేని క‌మెడియ‌న్ గా అవ‌త‌రించాడు. ఒక ర‌కంగా వెన్నెల ఆడిందే ఆట పాడిందే పాట‌. నిరంత‌రం ఏడాదికి డ‌జ‌నున్న‌ర సినిమాలు చేసే స‌త్తా ఒక్క వెన్నెల‌కు మాత్ర‌మే ఉంది. స్టార్ హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ వెన్నెల కావాలి. అత‌డి కోస‌మే క్యారెక్ట‌ర్లు రాసే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఉన్నారు. అందుకే అవ‌కాశాల వెల్లువ కొన‌సాగుతూ ఉంది.

ఎంత‌గా ప్ర‌య‌త్నించినా బ్ర‌హ్మానందం త‌ర్వాత ఆ ప్లేస్ ని కొట్టేయ‌లేక‌పోతున్నారెవ‌రూ. ఇత‌ర క‌మెడియ‌న్లు ప్ర‌య‌త్నించినా జ‌నాలు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. బ్ర‌హ్మీ మైలేజ్ ఈ రోజుల్లో ఎవ‌రికి ఉంది? అని ఆరాతీస్తే మ‌ళ్లీ వెన్నెల కిషోర్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు. అందుకే ఇదిగో ఇలా హ్యాపి బ‌ర్త్ డే వెన్నెలా ల‌వ్ యు అంటూ నేడు బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న అత‌డికి కేక్ తినిపిస్తున్నారు హీరో సుధీర్ బాబు.

`వీ- ది ఫిల్మ్‌` సినిమా సెట్లోని దృశ్య‌మిది. నేడు వెన్నెల కిషోర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతూ ఇదిగో ఇలా సెట్ లో కేక్ కట్ చేశారు. సుధీర్ ఇలా కేక్ తినిపిస్తున్నారు. సుధీర్ బాబుతో పాటు ఈ చిత్రంలో విల‌న్ గా క‌నిపిస్తున్న నాని ఏమ‌య్యాడు అన్న‌ది తెలియాలి. విదేశాల్లో వీ షెడ్యూల్ లో జాయిన్ అవుతార‌ని వార్త‌లొచ్చాయి.