Begin typing your search above and press return to search.

నువ్వు నాకు న‌చ్చావ్‌ లో ఆ డైలాగ్ వ‌ద్ద‌న్నార‌ట‌

By:  Tupaki Desk   |   24 March 2017 5:03 PM GMT
నువ్వు నాకు న‌చ్చావ్‌ లో ఆ డైలాగ్ వ‌ద్ద‌న్నార‌ట‌
X
తెలుగులో స్టార్ హీరోల సినిమాలంటే కొన్ని నియ‌మ నిబంధ‌న‌లుంటాయి. హీరోను హీరోగానే చూపించాలి. అత‌ను సామాన్యుడిలా ఉండ‌కూడ‌దు. అత‌డిపై ఎవ‌రూ చేయి చేసుకోకూడ‌దు. సెటైర్లు వేయ‌కూడ‌దు. హీరోను కించ‌ప‌రిచే డైలాగులు ఉండ‌కూడ‌దు. ఈ విష‌యంలో చాలామంది స్టార్ల‌తో పోలిస్తే వెంక‌టేష్ ఎంతో మెరుగు. ‘నువ్వునాకు న‌చ్చావ్’లో ఉద్యోగం స‌ద్యోగం లేని వెంకీ.. ‘మ‌ల్లీశ్వ‌రి’లో పెళ్లికాని ప్ర‌సాద్ పాత్ర‌ల్ని అంద‌రూ చేయ‌లేరు. ఇప్పుడైతే హీరోలు ఇమేజ్ ను దాటి క్యారెక్ట‌ర్లు చేస్తున్నారు కానీ.. వెంకీ ఎప్పుడో వాటికి శ్రీకారం చుట్టాడు. నిజానికి ‘నువ్వునాకు న‌చ్చావ్’ సినిమాలో త‌న‌మీద తాను సెటైర్ వేసుకోవ‌డంపై యూనిట్ స‌భ్యుల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తమ‌య్యాయ‌ట‌. కానీ వెంకీ మాత్రం ఆ సెటైర్ ఉండాల‌న్నాడ‌ట‌. ఆ డైలాగ్ సంగ‌తేంటో వెంకీ మాట‌ల్లోనే తెలుసుకుందాం ప‌దండి.

‘‘నువ్వు నాకు న‌చ్చావ్‌ సినిమాలో ఆల్రెడీ అర ఎక‌రం పోయింద‌నే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ విని యూనిట్లో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ డైలాగ్ తీసేయ‌మ‌ని కూడా అన్నారు. కానీ ఆ డైలాగ్ ఉండ‌నివ్వ‌మ‌న్నాను. నాకు వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు చేయాలంటే ఇష్టం. నా వ‌య‌సు దాచుకోవాల‌ని నేను అనుకోను. నా కొత్త సినిమా ‘గురు’లో నా సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ ఎంతో ఇష్టం. రొటీన్ సినిమాలు చేయ‌డం కూడా నాకిష్టం లేదు. మార్పు కోరుకుంటున్నా. ఒక టైంలో నా సినిమాలు.. నా న‌ట‌న ఒకేలా ఉన్నాయ‌నిపించింది. అందుకే వైవిద్య‌మైన సినిమాలు చేస్తూ వ‌చ్చా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నా. మ‌ధ్య‌లో ఒక క్రికెట్ బేస్డ్ స్టోరీ నా ద‌గ్గ‌రికి వ‌చ్చింది. కానీ అది న‌చ్చ‌లేదు. ‘గురు’ నా కోరిక‌ను నెర‌వేర్చింది అని వెంకీ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/