Begin typing your search above and press return to search.

రంగంలోకి దిగనున్న వెంకీ మామ

By:  Tupaki Desk   |   17 Feb 2019 5:30 PM GMT
రంగంలోకి దిగనున్న వెంకీ మామ
X
ఎఫ్2 విక్టరీతో తన బిరుదుని మరో సారి సార్థకం చేసుకున్న వెంకటేష్ అభిమానుల సంతోషం మాములుగా లేదు. ఇన్నేళ్ళ తర్వాత తమ హీరో ఇంత పెద్ద హిట్ కొట్టడం పట్ల ఆనందాన్ని మాములుగా వ్యక్తం చేసుకోవడం లేదు. దీని తర్వాత కూతురి ఎంగేజ్ మెంట్ కోసం కొంత గ్యాప్ తీసుకున్న వెంకీ ఈ నెల 24 నుంచి వెంకీ మామ కోసం జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. మొదటిసారి నాగ చైతన్యతో కలిసి ఫుల్ లెంగ్త్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న వెంకీ దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

పూజా కార్యక్రమాలు ఇంతకు ముందే చేసేసారు కాబట్టి నేరుగా రెగ్యులర్ షూటింగ్ ఇరవై ఐదు రోజుల పాటు రాజమండ్రిలో చేయబోతున్నట్టు తెలిసింది. ఇదే షెడ్యూల్ లో చైతు కూడా జాయిన్ అవుతాడు. రకుల్ ప్రీత్ సింగ్ చైతుకి జోడిగా కనపడనుండగా వెంకీ సరసన హీరొయిన్ గా శ్రేయను తీసుకున్నట్టు సమాచారం. జై లవకుశ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాబీ అలియాస్ రవీంద్ర స్క్రిప్ట్ కోసమే ఏడాది పైగా టైం వర్క్ చేసాడు.

మరో విశేషం ఏంటంటే ఇందులో వెంకటేష్ బిజినెస్ మెన్ గా చైతు ఆర్మీ సైనికుడిగా ఒకదానికి మరొకటి సంబంధం లేని పాత్రలు చేస్తున్నారట. నిజ జీవితంలోని వరసలే వెంకీ చైతులు చేస్తున్నట్టు టాక్. ఇంతకు ముందు ప్రేమమ్ లో వెంకీ చిన్న క్యామియోలో కనిపించి అలరించాడు. యూత్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేసేందుకు ఉత్సాహం చూపించే వెంకీ ఇప్పుడు స్వయానా మేనల్లుడితో జట్టు కట్టడంతో అంచనాలు పెరుగుతాయి. దసరా లేదా దీపావళి విడుదల ప్లాన్ చేసిన వెంకీ మామ టైటిల్ ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మజిలి షూటింగ్ పూర్తయ్యే దిశలో ఉండటంతో చైతు కూడా వెంకీ మామ కోసం పూర్తిగా అందుబాటులో ఉండనున్నాడు