దుల్కర్ కోసం ఆర్మీ ఆఫీసర్ గా వెంకీ!

Sun Sep 23 2018 21:45:33 GMT+0530 (IST)

టాలీవుడ్ లో చాలా మార్పులు వస్తున్నాయి.  స్టార్ హీరోలు కూడా కంటెంట్ కు ప్రాధ్యాన్యమిచ్చే సినిమాలు ఎంచుకుంటున్నారు. ఇక మల్టీ స్టారర్లకు.. ప్రయోగాత్మక చిత్రాలకు వెనకడుగు వేయడం లేదు. వీటన్నిటికి తోడు కొందరు స్టార్ లు పరాయి భాషా మార్కెట్ల మీద కన్నేస్తే.. మరికొందరు ఇతర భాషల నుండి వచ్చే ఆఫర్లను స్వీకరిస్తున్నారు.ఇప్పటికే జగపతి బాబు అన్నీ భాషలను కవర్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇక సీనియర్ స్టార్ అయిన నాగార్జున బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర' లోనూ.. ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక తమిళ చిత్రంలోనూ నటిస్తున్నాడు.  తాజాగా మరో సీనియర్ స్టార్ హీరో వెంకీ కూడా మలయాళం లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ - వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఒక వార్ డ్రామా అని ఇందులో వెంకీ ఒక ఆర్మీ జెనరల్ పాత్ర పోషిస్తాడని సమాచారం.  

ఈ సినిమాకు ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడట.  'OK బంగారం'.. 'మహానటి' సినిమాలతో దుల్కర్ సల్మాన్ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వెంకటేష్ - దుల్కర్ కాంబినేషన్ అంటే తెలుగులో ఆటోమేటిక్ గా క్రేజ్ వస్తుంది.  ఇక మలయాళంలో దుల్కర్ ఎలాగూ స్టార్ హీరో కాబాట్టి అక్కడ కూడా మంచి బిజినెస్ అవుతుందని మేకర్స్ ఈ కాంబో సెట్ చేశారట.  ఈ సినిమా జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.