మహర్షి మల్టీస్టారర్ కి మెరుగులు

Wed May 23 2018 23:15:00 GMT+0530 (IST)

ప్రస్తుతం అన్ని ఫిలిం ఇండస్ట్రీలలోను మల్టీస్టారర్ లకు బోలెడంత డిమాండ్ కనిపిస్తోంది. టాలీవుడ్ కూడా ఇందుకేమీ తీసిపోవడం లేదు. అయితే.. మల్టీస్టారర్ అనగానే మొదటగా ఒక పాత్ర కోసం వెంకటేష్ పేరు పరిశీలనలోకి వస్తుండడం గమనించాలి. ఇప్పుడు మరో మల్టీస్టారర్ మూవీకి బీజం పడినట్లుగా తెలుస్తోంది.రైటర్ గా జనార్ధన మహర్షికి మంచి గుర్తింపు ఉంది. దేవస్థానం.. పవిత్ర వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ఈయన ఓ కథ ప్రిపేర్ చేశాడు. ఇది వెంకటేష్ కు మొదటగా వినిపించగా.. ఆయనకు బాగా నచ్చేసింది. రెండో పాత్ర కోసం నాగచైతన్య అయితే బాగుంటుందని వెంకీ ఫీలవుతుండగా.. మహర్షి కూడా అదే మాట చెప్పాడట. దీంతో వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ఫిక్స్ అయిన వెంకీ.. స్టోరీ విషయంలో ఒరిజినల్ థీమ్ ను అలాగే ఉంచి.. మరి కొన్ని మార్పు చేర్పులు చేస్తే బాగుంటుందని సూచించాడట.

దీంతో రైటర్ కోన వెంకట్.. దర్శకుడు బాబీ రంగంలోకి దిగిపోయారు. వీరు కొన్ని మార్పులు చేసిన అనంతరం.. ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా సిద్ధమైనట్లు అయింది. పల్లెటూరి నేపథ్యంతో జరిగే ఈ కథలో వెంకీ-చైతు మేనమామ-మేనల్లుడుగా నటించనున్నారట. రియల్ లైఫ్ లో కూడా వీరి మధ్య ఉన్న అనుబంధం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం చేస్తున్న మరో మల్టీస్టారర్ మూవీ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను పూర్తి చేసి.. ఈ మూవీని మొదలుపెడతారట వెంకీ అండ్ చైతు.