వెంకీ మామ లవర్ చేంజ్ అయ్యిందా?

Wed Dec 12 2018 11:34:21 GMT+0530 (IST)

వెంకటేష్ చాలా కాలంగా తన మేనల్లుడు నాగచైతన్యతో ఒక చిత్రాన్ని చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. మామ అల్లుడిల మూవీ ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. వెంకీ మామ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ ను దర్శకుడు బాబీ ప్రారంభించాడు. నాగచైతన్య పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. తాజాగా ‘ఎఫ్ 2’ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని వెంకీ కూడా వెంకీమామ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. చైతూకు జోడీగా రకుల్ ను వెంకీకి హ్యూమా ఖురేషిని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ‘వెంకీ మామ’ చిత్రంలో హ్యూమ ఖురేషి కాకుండా శ్రియను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మొదట హ్యుమ ఖురేషి పేరు బలంగానే వినిపించింది. ఆమెతో టెస్ట్ షూట్ కూడా చేశారట. కాని ఏదో కారణం వల్ల ఆమె ఈ చిత్రంకు సెట్ అవ్వదని శ్రియను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ మరియు శ్రియలు రెండు చిత్రాల్లో నటించి మెప్పించడం వల్ల ప్రేక్షకులు మరోసారి ఆధరిస్తారనే నమ్మకంను దర్శకుడు పెట్టుకున్నాడు.

ఈ చిత్రంలో నాగచైతన్యకు వెంకీ పాత్ర భార్య అత్త అవ్వాల్సి ఉంటుంది. అంటే కాస్త ఎక్కువ వయసు ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో శ్రియను ఎంపిక చేసి ఉంటారని నాగచైతన్యకు శ్రియ అత్త అంటే కాస్త కన్విన్సింగ్ గానే ఉంటుందనే అభిప్రాయం చిత్ర యూనిట్ సభ్యులో ఉందట. అందుకే వెంకీమామ లవర్ ను చేంజ్ చేసి శ్రియను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈమద్య ఈమె బాలయ్యతో వరుసగా రెండు చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన శ్రియ ఇంకా కూడా సీనియర్ హీరోయిన్స్ తో నటిస్తూ స్టార్ గానే కొనసాగుతుంది. అందుకే ‘వెంకీ మామ’కు ఆమె తప్పకుండా ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.