Begin typing your search above and press return to search.

పవన్ కోసం 3 నిమిషాల వెంకీ కామెడీ

By:  Tupaki Desk   |   21 Jun 2017 7:01 AM GMT
పవన్ కోసం 3 నిమిషాల వెంకీ కామెడీ
X
హీరో వెంకటేష్‌ 'గోపాల గోపాల' సినిమాను చేస్తున్నప్పుడు.. ఆ సినిమాలో కృష్ణుడి పాత్రను ఎవరితో చేయించాలి అని అనుకున్నప్పుడు.. వెంటనే వెంకటేష్‌ కు తనకు ఎంతగానో ప్రీతిపాత్రమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ గుర్తొచ్చాడట. వెంటనే రోల్ గురించి చెప్పగా.. పవన్ కూడా ఫ్లూట్ వాయించేశాడు. ఇప్పుడు కట్ చేస్తే.. ఆ రోల్ చేసినందుకు ప్రతీకగా తను కూడా తన వంతు చేస్తున్నాడు వెంకీ.

త్రివిక్రమ్ డైరక్షన్లో ప్రస్తుతం ఒక ఇరానీ కేఫ్‌ బ్యాక్ డ్రాప్ లో.. పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా కనిపిస్తాడని టాక్. అందుకోసం మనోడు బాగా స్లిమ్ అయ్యాడు కూడా. అయితే ఈ సినిమాలో ఒక చిన్నపాటి కామెడీ చేసే పాత్ర ఒకటి ఉందట. దాని నిడివి కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ పాత్రను సునీల్ చేస్తే బాగుంటుందని రాసుకున్నాడు త్రివిక్రమ్. కాని కట్ చేస్తే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ ఈ పాత్ర కోసం వెంకీని తీసుకుని.. దానికి హీరోయిజం దట్టిస్తే బాగుంటుందని సెలవిచ్చాడట. దానితో ఈ పాత్రను కాస్త మార్చి వెంకీకి చెప్పగా.. డేట్స్ ఎప్పుడో చెప్పండి వచ్చి నటించి వెళిపోతా అన్నాడట. మొత్తానికి పవన్ సినిమాలో వెంకీ క్యామియో అంటే.. మరోసారి ఇదేదో చిన్నపాటి మల్టీస్టారర్ అనే ఫీలింగ్ వచ్చేస్తోంది.

ఆ మధ్యన కాటమరాయుడు సినిమా కోసం.. తమ్ముళ్ల పాత్రలను అంతగా క్రేజ్ లేని నటులకు ఇచ్చేసి.. తద్వారా వెండితెరపై సినిమాకు పెద్దగా ఫీల్ లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్‌. అభిమానులు నొచ్చుకున్నా ఇది వాస్తవం. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం.. క్యాస్టింగ్ పరంగా కాస్త గట్టి జాగ్రత్తలే తీసుకుంటున్నట్లున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/