12 నిమిషాలు తీసేసి... 7 నిమిషాలు కలిపారు

Fri Jan 12 2018 23:07:48 GMT+0530 (IST)

అజ్ఞాతవాసి ఇచ్చిన రిజల్ట్ కి చిత్ర యూనిట్ ఎంత బాధపడుతున్నారో తెలియదు గాని పవన్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ మాత్రం చాలా నిరాశ చెందుతున్నారు. హిట్ అయితే చిందులు ఎలా ఉండేవో చెప్పవచ్చు గాని సినిమా ఫట్ అయితే అభిమానుల బాధ వర్ణనాతీతం. సోషల్ మీడియాలో కూడా పవన్ అభిమానులు చాలా వరకు సైలెంట్ అయిపోయారు. అజ్ఞాతవాసి హిట్టుతో విమర్శకులకు గట్టిగా సమాధానం చెబుదామనుకున్న ఫ్యాన్స్ కి ఏ మాత్రం అవకాశం దొరకలేదు.ఇక అసలు విషయానికి వస్తే సినిమా మొదట నుంచి హిట్టు టాక్ తెచ్చుకుంటుందని చిత్ర యూనిట్ అనుకుంది. ఎలాగూ కలెక్షన్స్ గట్టిగా వస్తాయి కదా ఆ తరువాత పండగకి  సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రకు సంబందించిన సీన్స్ ను యాడ్ చేద్దామని అనుకుంది. కానీ ఇప్పుడు కొంచెం నష్టాల నుంచి బయటపడాలని ఆ సీన్ యాడ్ చేస్తున్నారు. ఆ విషయం తెలిసిందే. ఇక ఈ తీసిపోతల లెక్కలను ఓసారి చూస్తే.. మొత్తంగా సినిమాలో 12 నిమిషాల వరకు తీశారట. ఇక ఎక్కువగా బోర్ కొట్టకుండా బాగా ఉండే సీన్లను ఓ 7 నిమిషాల 26 సెకన్ల వరకు యాడ్ చేశారట. అందులోనే వెంకటేష్ - పవన్ సీన్ కూడా ఉందని టాక్.

అయతే ఈ సీన్లను సంక్రాంతి నుండి చూపిస్తారని కొందరు అంటుంటే.. అబ్బే రేపు ఉదయం పడిపోయే బొమ్మలోనే ఈ తీసిపోతలు కనిపిస్తాయని అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే సినిమాకు చాలా నెగిటివ్ టాక్ ఉంది. మరి ఆ సీన్స్ ఏమైనా సినిమాకు హెల్ప్ అవుతుందో లేడి చూడాలి.