Begin typing your search above and press return to search.

మూడో సీజన్ హోస్టింగ్ పై స్పందించిన వెంకీ

By:  Tupaki Desk   |   11 Jan 2019 9:17 AM GMT
మూడో సీజన్ హోస్టింగ్ పై స్పందించిన వెంకీ
X
బిగ్ బాస్ ను తెలుగులో ఆదరిస్తారా అన్న అనుమానాలకు మొదటి సీజన్లోనే సమాధానం దొరికింది. ఇక రెండో సీజన్లో హోస్ట్ నాని కి ఇబ్బంది ఎదురైనా ఓవరాల్ గా బిగ్ బాస్ మాత్రం సక్సెసే. ప్రస్తుతానికి వస్తే మూడో సీజన్ బిగ్ బాస్ గురించి.. బిగ్ బాస్ ను హోస్ట్ చేయబోయే స్టార్ గురించి ఇప్పటికే మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ను బిగ్ బాస్ ఆర్గనైజర్స్ సంప్రదించినట్టుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ విషయంపై వెంకీ స్పందన ఏంటి?

వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ 3 హోస్ట్ చేయడం గురించి వెంకీ కి ప్రశ్న ఎదురైతే "అదో రూమర్" అంటూ తోసిపుచ్చాడు. అంటే.. అసలు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ దగ్గుబాటి హీరోను సంప్రదించడం అనేది స్పెక్యులేషన్ అయినా కావచ్చు. లేదా వెంకీనే హోస్ట్ గా చేయడం ఇష్టంలేక.. రూమర్ అని తోసిపుచ్చి ఉండవచ్చు.

ఏదేమైనా రెండో సీజన్లో వివాదాల దెబ్బకు తెలుగు హీరోలు బిగ్ బాస్ హోస్టింగ్ అంటేనే కాస్త వెనకాముందూ ఆలోచిస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్.. నాని ల తర్వాత ఎవరు హోస్ట్ గా చేస్తారనేదాని పై టీవీ ప్రేక్షకులకు మహా ఆసక్తిగా ఉంది. ఇదిలా ఉంటే జూన్ లో బిగ్ బాస్ మూడో సీజన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.