Begin typing your search above and press return to search.

వెంకీ వన్ మ్యాన్ షో

By:  Tupaki Desk   |   12 Jan 2019 11:08 AM GMT
వెంకీ వన్ మ్యాన్ షో
X
ఇవాళ సంక్రాంతి రేస్ లో విడుదలైన ఆఖరి సినిమాగా వచ్చిన ఎఫ్2 కు పాజిటివ్ టాక్ వస్తోంది. సెకండ్ హాఫ్ గురించి అభిప్రాయం డివైడ్ రీతిలో ఉన్నప్పటికీ ఫైనల్ గా ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిందన్న మాట కలెక్షన్లపై సానుకూల ప్రభావం చూపేలా ఉంది. కథ పరంగా ఇందులో కొత్తదనం కానీ గొప్పదనం కానీ ఏమి లేదు. సన్నివేశాలు సంభాషణలు వినోదాత్మకంగా ఉండటంతో జనాలు బాగానే కనెక్ట్ అవుతున్నారు. నవ్వులు గ్యారెంటీ అనే మాట బయటికి రావడంతో ఇదంతా ప్లస్ అయ్యేదే. అయితే దీనికి కారణం ఒకటే కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్.

చాలా కాలం తర్వాత తనదైన రీతిలో కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన తీరు వెంకీ పాత రోజులను అభిమానులకు గుర్తుకు తెస్తుండగా సాధారణ ప్రేక్షకులు కూడా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని తన భుజాలపై సోలోగా మోసేసిన వెంకీ అన్నపూర్ణ వైవిజయ లాంటి సీనియర్ ఆర్టిస్టులు వరుణ్ తేజ్ మెహ్రీన్ లాంటి యంగ్ జనరేషన్ స్టార్స్ ఎందరు ఉన్నా అందరికి డామినేట్ చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన నటనతో ప్రతిఒక్కరిని అవతల తీసి పారేసాడు.

ఎఫ్2 కి ఈ మాత్రం టాక్ రావడంలో వెంకటేష్ పెర్ఫార్మన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. లేట్ గా పెళ్ళైన వాడిగా తోడల్లుడిని హీరోయిన్ ఫ్యామిలీ నుంచి కాపాడాలి అనుకునేవాడిగా ఇలా రకరకాలుగా అన్ని సీన్స్ తో టైమింగ్ తో కట్టిపారేసాడు. కుక్కని లోబరుచుకునే సీన్ లో వరుణ్ తేజ్ భవిష్యత్తుని ఊహించుకుని అతన్ని హెచ్చరించే సన్నివేశాల్లో వెంకీ బెస్ట్ ని ఇందులో చూడొచ్చు. వీటినే ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా లోపాలను వెంకీ దాదాపుగా కవర్ చేసాడు.ఎప్పుడో నువ్వు నాకు నచ్చావ్ - మల్లీశ్వరి నాటి వెంకీ బ్రాండ్ కామెడీ ఇందులోనే చూశామన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదేమైనా వెంకటేష్ గురు తర్వాత రెండేళ్ల గ్యాప్ తో వెంకీ మొత్తానికి రైట్ ఛాయస్ తోనే వచ్చాడు