సెలవులు లేవు వరస సినిమాలే

Sat Aug 12 2017 12:09:59 GMT+0530 (IST)

ఇప్పుడు మన  యంగ్  స్టార్ హీరోలు అయితే ఏడాది ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు కానీ కొన్ని ఏళ్ళు కిందట హీరోలు అయితే ఒకే ఏడాది వరసుగా విరామం లేకుండా సినిమాలు తీసేవారు. ఇప్పుడు ఉన్న హీరోలు ఇప్పటికీ నటిస్తున్న ఆ పాత హీరోలు విరామం లేకుండా పని చేయడానికి వాళ్ళు సిద్దంగా ఉన్నాం అని చెబుతున్నా అందరూ ఆగి ఆలోచిస్తున్న విషయం ఏంటంటే కథ. ఈ కథ లేనందు వలనే నా సినిమాకు సినిమాకు మధ్య విరామం ఎక్కువగా వస్తుంది అని చెబుతున్నాడు ఒక పెద్ద హీరో.విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ ఇప్పుడు కథలు వేటలో పూర్తిగా మునిగిఉన్నాడు. ‘గురు’ సినిమా తరువాత ఇప్పటి వరకు ఏ సినిమాను ఓకే చేసిన సంకేతాలు లేవు. గురు తరువాత కొంచం టైమ్ తీసుకుంటాను అని చెప్పిన వెంకటేష్ ఇప్పుడు తన సెలవులకు టాటా చెప్పి పని మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. వరుసగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన వెంకటేష్ ఇప్పుడు ఇన్ని నెలలు గ్యాప్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సురేశ్ ప్రొడక్షన్ హౌస్ సమాచారం ప్రకారం వెంకటేష్ తన కొత్త సినిమా జంతువుల నేపథ్యంలో సాగే ఓ కథతో రాబోతున్నాడు అని తెలుస్తుంది. సురేశ్ బాబు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించి వెంకీ అభిమానాలుకు శుభవార్త చెప్పాడు. ఈ సినిమా రియల్ షూటింగ్ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటుంది అని కూడా చెబుతున్నారు. ఈ కథ వెంకటేష్ కు బాగా నచ్చింది అని తెలుస్తుంది.

ఈ సినిమా స్క్రిప్ట్ తో తర్జనబర్జన పడుతూనే మరో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ చెప్పిన కథ విన్నాడు అంటా వెంకీ. ఈ సినిమా కథ కూడా కొత్తగా ఉండటంతో పైగా పూరీ కూడా వెంకటేష్ లానే ఒక సినిమాను తొందరగా పూర్తి చేసే అలవాటు ఉండటంతో ఈ సినిమా కూడా మొదలయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఈ రెండు కాకుండా ఈ మధ్యనే విడుదలైన తమిళ్ సినిమా ‘విక్రమ్ వేద’ సినిమాను తన అన్న కొడుకు యంగ్ హీరో రానా తో కలిసి ఒక మల్టీస్టార్ మూవీ కి సై అనే ఆలోచన ఉంది అని తెలుస్తుంది. మొత్తానికి వెంకీ మళ్ళీ ట్రాక్ లో పడినట్లు ఉన్నాడు కొత్త కథలు కొత్త డైరెక్టర్లతో.