కొత్త సినిమా: వెంకీతో త్రివిక్రమ్..

Tue Dec 12 2017 19:14:24 GMT+0530 (IST)

అప్పుడెప్పుడో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' 'మల్లీశ్వరి' సినిమాలంటే ఇప్పటకీ తెలుగు ప్రేక్షకులకు పిచ్చి ప్రేమ. ఆ సినిమాలను తీసింది దర్శకుడు విజయ్ భాస్కర్ అయినా కూడా.. రాసింది మాత్రం త్రివిక్రమ్. ఆ పదునైన మాటల కామెడీ ఏదైతే ఉందో.. ప్రేక్షుకులను మాయలో పడేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమాల రైటర్ డైరక్షన్లో వెంకటేష్ ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది?ఎలా ఉంటుంది ఎలా ఉండదు అనే సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు తన తదుపరి సినిమాలో వెంకటేష్ ను త్రివిక్రమ్ డైరక్ట్ చేయబోతున్నాడు. ఇదేదో గాలి వార్త కాదండోయ్. రేపు వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఇప్పుడు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తమ బ్యానర్లో 6వ ప్రొడక్షన్ వెంచర్ ను మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ డైరక్షన్లో  చేయబోతున్నట్లు ప్రకటించారు. భలే క్రేజీ న్యూస్ కదూ.

ఇకపోతే ఈ బ్యానర్ వారి 4వ సినిమా 'అజ్ఞాతవాసి'.. అలాగే 5వ సినిమాను జూనియర్ ఎన్టీఆర్.. ఇక 6వ సినిమా వెంకటేష్ తో.. త్రివిక్రమ్ స్వయంగా డైరక్ట్ చేస్తుండటం విశేషం. మరి ఈ బ్యానరోళ్లు బయట దర్శకులతో కూడా పార్టనర్షిప్ లో సినిమాలు చేస్తున్న వేళ.. త్రివిక్రమ్ మాత్రం ఇక బయట బ్యానర్లకు సినిమాలు చేయడా?