ట్రైలర్ టాక్: ఒక రేంజులో దంచేసిన గురు

Mon Mar 20 2017 21:23:40 GMT+0530 (IST)
సాలా కడ్డూస్ సినిమా చూసినప్పుడు అసలు మాధవన్ చేసినట్లు వెంకీ చేస్తాడా అనుకుంటే.. ఇక్కడ మనోడు చితక్కొటి చేతిలో పెట్టేశాడు. తను వేసుకున్న బాక్సింగ్ గ్లవ్ పంచ్ ఏంటో చూపించడానికి ఇప్పుడు ఒక ట్రైలర్ వదిలాడు. ముఖ్యంగా తన వాయిస్ లోని డెప్త్ తో ఇరగ్గొట్టేశాడు. పదండి చూద్దాం.

స్లమ్ నుండి వచ్చిన ఒకమ్మాయిని బాక్సింగ్ ఛాంపియన్ చేయాలనే ఉద్దేశ్యంతో కోచ్ వెంకీ మాంచి కసిమీద రంగంలోకి దిగుతాడు. అయితే ఆ అమ్మాయి మాట వినదు. ఆ తరువాత జరిగిన కథ ఏంటనేదే సినిమా. సుధ కొంగర డైరక్షన్ ఓ రేంజులో ఉంటే.. వెంకీ యాక్టింగ్ అదిరిపోయింది. అలాగే గురువు శిష్యురాలిగా నటించిన రీతికా సింగ్ కూడా సింప్లీ సూపర్బ్.  ఇకపోతే.. 'ఊర కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని దృష్టంతా ఎప్పుడూ పెంట మీదనే ఉంటుంది' అంటూ అసలు ఏ స్టార్ హీరో కూడా చెప్పని డైలాగ్ ను చెప్పేశాడు వెంకటేష్. అలాంటి సింపుల్ అండ్ రియల్ లైఫ్ డైలాగులు ఈ సినిమాలో కోకల్లలు అనే చెప్పాలి. మొత్తంగా తన లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో వెంకీ మ్యాజిక్ చేశాడు.

ఇకపోతే రితికా సింగ్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి గురు సినిమాను అంత తేలికగా తీసిపాడేయలేం అని ఈ ట్రైలర్ ప్రూవ్ చేసినట్లే. ఒకవేళ మాస్ కు కనుక సినిమా కనక్ట్ అయితే.. ఈ హిట్టు రేంజు ఓ రేంజులో ఉంటుంది. కాకపోతే సినిమా రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు గురూ.. జస్ట్ కమింగ్ సూన్ అంటున్నారు.