Begin typing your search above and press return to search.

బారిష్టర్ పాత్రలో వెంకటేష్!!

By:  Tupaki Desk   |   29 March 2017 10:45 AM GMT
బారిష్టర్ పాత్రలో వెంకటేష్!!
X
వెంకటేష్ నటించిన గురు మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో మిడిల్ ఏజ్డ్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్న వెంకీ.. తన వయసుకు తగిన పాత్రలో నటించినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ప్రస్తుతం గురు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వెంకీ.. బోలెడన్ని సంగతులు చెప్పేస్తున్నాడు.

ఇటు గురు ప్రచారం చేస్తూనే.. కొత్త సినిమా విషయాలు కూడా చెబుతున్నాడు విక్టరీ వెంకటేష్. పూరీ జగన్నాధ్ తో ఓ మూవీ చర్చల్లో ఉండగా.. మరికొందరు దర్శకులతో కూడా మాటా మంతీ జరుగుతున్నాయి. ఇప్పుడు వెంకటేష్ ప్రధాన పాత్రలో.. ఓ టాలీవుడ్ క్లాసిక్ ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 1940లో వచ్చిన టాలీవుడ్ చిత్రం బారిష్టర్ పార్వతీశంగా వెంకీని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొక్కపాటి నరశింహ శాస్త్రి 1924లో రాసిన బారిష్టర్ పార్వతీశం నవల ఆధారంగానే ఈ చిత్రం రూపొందించారు.

77 ఏళ్ల క్రితం లంకా సత్యం పోషించిన పాత్రలో.. వెంకటేష్ నటించడం అంటే కచ్చితంగా ఆకట్టుకునే విషయమే. అయితే.. అప్పట్లో బారిష్టర్ పార్వతీశం చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పటి ట్రెండ్ ప్రకారం చూస్తే మాత్రం.. ఇలాంటి పీరియాడిక్ మూవీస్ కి డిమాండ్ బాగానే ఉంటుంది. పైగా వెంకీ డిఫరెంట్ ఇమేజ్ కి ఈ పాత్ర సరిగ్గా సెట్ అవుతుందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/